లేచిన వేళ మంచిది : పాము నోట్లోంచి తప్పించుకున్న జింక వీడియో

  • Published By: nagamani ,Published On : June 3, 2020 / 11:32 AM IST
లేచిన వేళ మంచిది : పాము నోట్లోంచి తప్పించుకున్న జింక వీడియో

అడవిలో చాలా చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. బలమైన జంతువులు చిన్న జంతువుల్ని వేటాడి తినేస్తుంటాయి. కానీ ఆ పెద్ద బలమైన జంతువుల నుంచి చిన్న జంతువులు చిత్రంగా..తప్పించేసుకుంటాయి. క్రూరమృగాలకు కూడా చిన్నపాటి చిరుజీవులు బోల్తా కొట్టించి ఎస్కేప్ అయిపోతుంటాయి. అటువంటిదే జరిగింది. 

ఓ పేద్ద పాము. కొండచిలువ. చాలా పొడువుగా ఉంది. జింకను ఎటూ కదలకుండా వడిచి పట్టేసింది. జింక శరీరం మొత్తాన్ని చుట్టేసింది.  మింగేయడానికి తెగ తాపత్రాయపడిపోయింది. ఇక నా పని అయిపోయింది..ఈరోజుతో ఈ పాములో నోట్లో పడి  నా జీవితం అంతం అయిపోయింది అనుకుంది. 

కానీ ఇంతలో దేవుడిలా వచ్చాడు ఓ వ్యక్తి. అక్కడే ఓ కారు ఆగి ఉంది. బహుశా ఆ కారులోంచి దిగిన వ్యక్తే అయి ఉంటాడు. జింకను చుట్టేసి మింగేయటానికి యత్నిస్తున్న కొండ చిలువను చూశాడు.  పక్కనే ఉన్న చెట్టుకొమ్మ సాయంతో పామును కొట్టాడు. ఆ దెబ్బ ఆ పాముకు పెద్దపాటిది కాదు. కానీ మంచి ఆహారం దొరికిన టైములో మనిషి తనను డిస్ట్రబ్ చేస్తున్నాడని ఆ  పాముకి సర్రున కోపమొచ్చింది. అంతే కొమ్మతో కొడుతున్న వ్యక్తిపై సర్రున లేచింది. పైకి లేచి బుసలు కొట్టింది. 

కానీ అతను వదల్లేదు మరోసారి కొట్టాడు.ఇలా కాదని అతను కొమ్మను పడేసి ఈ సారి కర్రతో పాముని కొట్టాడు. దీంతో పాము ఇక ఈ జింక నాకు దక్కేలా లేదు. ఈ మనిషి నా పని అవ్వనిచ్చేలా లేడు అనుకుందో ఏమోగానీ ఆ పాము జింకని వదిలి వెళ్లిపోయింది. పాము వదిలి వదలంగానే జింక బ్రతుకు జీవుడా అనుకుంటూ తుర్రుమంది. 

ఈ వీడియోను ట్విటర్‌ యూజర్‌ వినీత్‌ వశిస్ట్ పోస్ట్ చేయగా..ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. అవునూ ఇది ఎక్కడ జరిగిందా?అని ఆలోచిస్తున్నారు కదూ..జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో జరిగింది. 

Read:  కాపాడమని కోర్టుకెళ్లిన నవ దంపతులకు రూ.10వేలు జరిమానా..ఎందుకంటే