Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీబీఐ తాజాగా కోర్టును ఆశ్రయించింది.

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం తాజా నిర్ణయం వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీబీఐ తాజాగా కోర్టును ఆశ్రయించింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. దీంతో ఆయనను అధికారులు తిహార్ జైలుకు తరలించారు. సిసోడియా కోరిక మేరకు ఆయనకు మెడిటేషన్ సెల్ కేటాయించాలని జైలు సూపరిండెంట్‌ను కోర్టు ఆదేశించింది. అక్కడ ఆయనకు కళ్ల జోడు, డైరీ, పెన్ను, భగవద్గీత, మందులను ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మార్చి 20కి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ మనీశ్ సిసోడియా కోర్టును ఆశ్రయించారు. గతంలో బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో బెయిల్ కోసం ఆయన మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ నెల 10న ఆయన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపుతుంది.