Child Marriage: ఏడాది వయసులోనే వివాహం.. చిన్నారి పెళ్లిని 20 ఏళ్లకు రద్దు చేసిన కోర్టు

పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.

Child Marriage: ఏడాది వయసులోనే వివాహం.. చిన్నారి పెళ్లిని 20 ఏళ్లకు రద్దు చేసిన కోర్టు

Child Marriage: ఏడాది వయసున్నప్పుడు.. ఇరవై ఏళ్లక్రితం జరిగిన ఒక చిన్నారి పెళ్లిని రద్దు చేసింది కోర్టు. రాజస్థాన్‌లోని ఒక ఫ్యామిలీ కోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది. జోధ్‌పూర్ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన రేఖ అనే 21 ఏళ్ల యువతికి అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంది.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

ఇరవై ఏళ్ల క్రితం.. రేఖకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తాత చనిపోయారు. ఈ సమయంలో రేఖకు, అదే గ్రామానికి చెందిన ఒక బాలుడితో పెళ్లి జరిపించారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు 20 ఏళ్లు దాటడంతో, చిన్నప్పటి పెళ్లికి కట్టుబడి ఉండాలని పెద్దలు నిర్ణయించారు. అప్పుడు వివాహం జరిపించిన బాలుడితో కాపురం చేయాలని రేఖకు సూచించారు. దీనికి రేఖ నిరాకరించింది. దీంతో తమ కుమారుడితో పెళ్లికి అంగీకరించకుండా, కాపురం చేయకూడదనుకుంటే అత్తమామలు తమకు రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పంచాయితీ నిర్వహించి ఈ మేరకు తీర్మానం కూడా చేయించారు.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

అయితే, ఈ పెళ్ళి ఇష్టంలేకపోవడంతోపాటు, చదువుకుని ఏఎన్ఎమ్ కావాలని కోరుకున్న రేఖ ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. దీంతో ఆ సంస్థ రేఖ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ పెళ్లిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగడం దుష్పరిణామమని, ఈ సంప్రదాయాన్ని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని కోర్టు సూచించింది. మరోవైపు తన పుట్టిన రోజు సమయానికే కోర్టు పెళ్లిని రద్దు చేస్తూ తీర్పునివ్వడం ఆనందంగా ఉందని, ఇకపై చదువు మీద దృష్టి పెడతానని రేఖ పేర్కొంది.