Mask less Man: మాస్క్ పెట్టుకోని వ్యక్తిని చితకబాదిన పోలీసుల సస్పెండ్

మాస్క్ పెట్టుకోండయ్యా బాబూ.. అంటే ఎవడికి వాడు ఏమీ పట్టనట్లే విచ్ఛలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా...

Mask less Man: మాస్క్ పెట్టుకోని వ్యక్తిని చితకబాదిన పోలీసుల సస్పెండ్

Mask Less Man Beaten By Police Suspended

Mask less Man: మాస్క్ పెట్టుకోండయ్యా బాబూ.. అంటే ఎవడికి వాడు ఏమీ పట్టనట్లే విచ్ఛలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా చేరి ఉగ్ర రూపానికి మారకముందే జాగ్రత్తపడమంటుంటే గాలికే వదిలేస్తున్నారు. ఇక కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే లేదంటే భారీగా ఫైన్ కట్టమని బెదిరిస్తుంటే వారికి దొరక్కుండా తిరుగుతున్నారే కానీ సామాజిక బాధ్యతే కనిపించడం లేదు.

మధ్యప్రదేశ్ లోని 35ఏళ్ల వ్యక్తిని మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించడంతో వాదన మొదలైంది. ఇక పోలీసులు చేతివాటం చూపించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు లాటీలతో నడిరోడ్డుపై ఆ వ్యక్తిని చితకబాదారు. రోడ్ పై వెళ్తున్న వ్యక్తి ఎవరో వీడియో తీయడంతో అది వైరల్ అయింది. విషయం పై అధికారులకు చేరడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

పోలీసులు ముందుగా ఆ వ్యక్తి దుర్భాషలాడాడని చెప్తున్నారు. ఆ వీడియోలో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే తోసేసినట్లు కనిపిస్తుంది. అతని కొడుకు, భార్య వదిలేయమని ప్రాధేయపడినా వినిపించుకోలేదు.

ఎస్పీ అషుతోష్ బాగ్రీ మాట్లాడుతూ.. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. విషయం దర్యాప్తు చేయమని ఆదేశాలిచ్చాం. నిందితుడు మాస్క్ ధరించలేదని పోలీసులు ఆపేశారు. కొవిడ్ నిబంధనలు పాటించనందుకు వివరణ అడిగారు.

ఆ వ్యక్తి ఒక కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని తిట్టి, దాడి చేశాడని పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎడిటింగ్, క్రాపింగ్ చేసి పోలీసుల పరువు తీసేలా ఉందని బగ్రీ అన్నారు.