Twins died : క‌రోనాతో క‌వ‌ల పిల్ల‌లు మృతి..3 నిమిషాల తేడాతో పుట్టారు..గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు

వాళ్లిద్దరూ కవలలు. మూడు నిమిషాల తేడాతో అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రయోజకులూ అయ్యి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టారు. అంతా సంతోషమే నిండిన సమయంలో కరోనా కన్ను ఆ ఆనందమైన కుటుంబం మీద పడింది. అంతే ఆ ఇద్దరు కవల పిల్లలకు కరోనా సోకిందని తెలిసి కేవలం మూడు రోజులకే ఇద్దరు కవలలు చనిపోవటంతో ఆ టీచర్ దంపతుల ఇంటిలో అంతులేని విషాదం నెలకొంది.

Twins died : క‌రోనాతో క‌వ‌ల పిల్ల‌లు మృతి..3 నిమిషాల తేడాతో పుట్టారు..గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు

Meerut Twins Died With Corona

Meerut Twins died with Corona : వాళ్లిద్దరూ కవలలు. మూడు నిమిషాల తేడాతో అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారు. చక్కగా చదువుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రయోజకులూ అయ్యి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టారు. తల్లిదండ్రులిద్దరూ టీచర్లే కావటం..ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుని ఇంజనీర్లు పూర్తి చేయటం ఇలా వారి ఇంటిలో అంతా సంతోషమే నిండిన సమయంలో కరోనా కన్ను ఆ ఆనందమైన కుటుంబం మీద పడింది. అంతే ఆ ఇద్దరు కవల పిల్లలకు కరోనా సోకిందని తెలిసి కేవలం మూడు రోజులకే ఇద్దరు కవలలు చనిపోవటంతో ఆ టీచర్ దంపతుల ఇంటిలో అంతులేని విషాదం నెలకొంది. సంతోషంగా తుళ్లిపడుతున్న ఆ కుటుంబాన్ని విషాదం పెను మబ్బులా కమ్మేసిన ఘటన మీటర్ లో చోటుచేసుకుంది. వారి సంతోషం మొత్తాన్ని కరోనా మహమ్మారి హరించివేసిన ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.

గ్రెగరీ రాఫెల్,సోజా దంపతులు మీరట్ లోని సెయింట్ థామస్ స్కూల్ లో టీచర్లు. వారికి ముగ్గురు మగ పిల్లలు. వారి పేర్లు జాఫ్రెడ్‌, రాల్‌ఫ్రెడ్.ఆకాశమంత ఆనందంతో జీవించే వారి కుటుంబంలో కరోనా సోకింది. ఏప్రిల్ 23న ఆ ఇద్దరు కవలలు 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే ఆ ఇద్దరికీ ఆ మర్నాడే కరోనా పాజిటివ్ అని తేలింది.

మే 1న ఆరోగ్యం క్షీణించిన ఆ ఇద్దరు కవలలను నగరంలోని ఆనంద్ ఆసుపత్రిలో చేర్చించారు తల్లిదండ్రులు. మే 10న కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ అని తేలింది. టంతో..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తాం కదానుకున్నారు. ఇద్దరూ కరోనా నుంచి తప్పించుకున్నారనే ఆ కుటుంబం ఆనందం నాలుగు రోజులు కూడా మిగల్లేదు. మే 13న జోఫ్రెడ్ ఊపిరి ఆడక బాధపడుతున్నాడని హాస్పిటల్ నుంచి ఫోన్ రావటంతో వెంటనే హాస్పిటల్ కు వెళ్లేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు గుండెలు బ్రద్ధలైపోయాయి. కంటికి కడివెడిగా ఏడ్చారు. ఆ శోకంలోనే జోఫ్రెడ్ పక్క బెడ్ పైనే ఉన్న రాల్ ఫ్రెడ్ కూడా పరిస్థితి. ఊపిరి ఆడక జోఫ్రెడ్ మరణించిన రాల్ ఫ్రెడ్ కూడా మర్నాడే చనిపోయాడు. ఊపిరితిత్తుల దాకా ఇన్ ఫెక్షన్ సోకడం వల్లే వారిద్దరూ మరణించారని డాక్టర్లు తెలిపారు. ఇక ఆ తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. కొడుకుల మీద వారు పెట్టుకున్న ఆశలన్నీ కరోనా కాటుకు బలైపోయాయి. వారికి లోకమే చీకటైపోయింది.