భారత ఆర్మీలో హవిల్దార్ మేక.. ‘మస్తానా’ స్టోరీ గురించి మీకు తెలుసా?

భారత ఆర్మీలో హవిల్దార్ మేక.. ‘మస్తానా’ స్టోరీ గురించి మీకు తెలుసా?

Mastana Goat Hawaldar Indian Army : భారత ఆర్మీలో హవిల్దార్ మేక.. ‘మస్తానా’ స్టోరీ ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ మస్తానా మేక.. ప్రస్తుతం భారత ఆర్మీలోని హవిల్దార్ ర్యాంకు దగ్గర ఉంది. అసలు మేక ఏంటి? మస్తానా ఏంటి? ఇదంతా తెలియాలంటే 1965 నాటి భారత్-పాకిస్తాన్ వార్ గుర్తు చేసుకోవాలి. భారత్-పాక్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక మేక భారత సైనికుల కంట పడింది. పూర్తిగా రాళ్లతో కూడిన ప్రాంతమిది.

అగ్ని దేవతగా పిలిచే ‘జ్వాలా దేవి’ కోసం భారత సైనికులు ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా ఈ మేక కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. చుట్టూ రాళ్లతో కూడిన ప్రాంతంలోకి మరో వైపు నుంచి సురక్షితంగా లోపలికి ప్రవేశించింది.

అలా వచ్చిన ఈ మేకను జ్వాలా దేవీనే తమకు సందేశంగా పంపిందని వారంతా విశ్వసించారు. అప్పుడే ఈ మేకకు ‘మస్తానా’ అని నామకరణం చేశారు. అప్పటినుంచి ఆ మేకను తమతోనే ఉంచుకున్నారు.

mastana

.కొన్నాళ్లకు మస్తానా మేక మరణించింది. ఆ మేక స్థానంలో మరో మేకను తీసుకొచ్చి దానికి మస్తానా పేరు పెట్టారు. అలా అప్పటినుంచి ప్రతి మేకను ఇలా మస్తానా హవిల్దార్‌గా మారుస్తూనే వచ్చారు. ఇప్పుడు మస్తానా మేక 65కు చేరుకుంది. ఇది.. మస్తానా వెనుక అసలు కథ…