ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరూ మేలు చేస్తుంది : మంత్రి అనురాగ్ ఠాకూర్  

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 05:04 AM IST
ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరూ మేలు చేస్తుంది : మంత్రి అనురాగ్ ఠాకూర్  

స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరికి మేలు చేసే విధంగా రూపొందించామని తెలిపారు. బ‌డ్జెట్ సంద‌ర్భంగా ఇవాళ మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌న నివాసంలో ఉన్న దేవుడి ముందు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న నినాదంతో మోదీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ద‌ని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశం న‌లుమూల‌ల నుంచి బ‌డ్జెట్ విష‌యంలో స‌ల‌హాలు అందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ బ‌డ్జెట్ ఉప‌యోగ‌ప‌డాల‌న్న ఉద్దేశంతో దాన్ని త‌యారు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టనున్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మ‌రికాసేప‌ట్లో లోక్ సభలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆమె రెండ‌వ‌సారి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 2020-21 బ‌డ్జెట్ ప్ర‌తుల కోసం ఢిల్లీలో ఆమె ఇవాళ  ఆర్థిక శాఖ ఆఫీసుకు వెళ్లారు.  ఆ త‌ర్వాత బ‌హీఖాతా బుక్‌ను ఆమె మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు. ఎర్ర‌టి వ‌స్త్రంతో బ‌డ్జెట్ బుక్‌ను సీల్ చేశారు.  గ‌తంలో కేంద్ర ఆర్థిక మంత్రులు.. బ‌డ్జెట్ స‌మ‌యంలో బ్రీఫ్‌కేసుతో పార్ల‌మెంట్‌కు వ‌చ్చేశారు. అయితే మోదీ ప్ర‌భుత్వం కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపిన క్రమంలో బడ్జెట్ కు సంబంధించిన బుక్  ఎర్ర‌టి వ‌స్త్రంతో క‌ప్పిన ఖాతా బుక్‌ను బ‌డ్జెట్ స‌మ‌యంలో పార్ల‌మెంట్‌కు తీసుకువచ్చారు.