South African Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలు..! ఎప్పుడంటే?

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది.

South African Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలు..! ఎప్పుడంటే?

South African Cheetahs

South African Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దక్షిణాసియా దేశం నుంచి చిరుతలను తిరిగి భారత్‌కు తీసుకురావాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది.

Female Cheetahs: అరణ్యంలోకి ప్రవేశించిన మరో రెండు చీతాలు.. క్వారంటైన్ పూర్తి కావడంతో విడిచిపెట్టిన అధికారులు

భారతదేశం ఒకప్పుడు ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. 1952 నాటికి చిరుతల సంఖ్య పూర్తిగా క్షీణించిపోయింది. అయితే, ఇలాజరగడానికి ప్రధాన కారణం చిరుతలను వేటాడటం. స్మగ్లర్లు చిరుతలను వేటాడి వాటి చర్మాన్ని అక్రమ రవాణా చేసేవారు. కాలక్రమంలో స్మగ్లర్ల భారినపడి రక్షణ లేకపోవటంతో చిరుతల సంఖ్య పూర్తిగా అంతరించిపోయిందన్న వాదన ఉంది. అయితే, మళ్లీ దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా గత ఏడాది నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారతదేశానికి రప్పించారు. ఈ చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్‌లో తన 70వ పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి ఈ చిరుతలను వదిలారు.

Cheetahs Again In India : 70 సంవత్సరాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు.. మరో ఖండం నుంచి తీసుకురావడం ఇదే తొలిసారి

ఆఫ్రికన్ చిరుతలను జాగ్రత్తగా ఎంచుకున్న ప్రదేశంలో ప్రయోగాత్మకంగా దేశంలోకి ప్రవేశపెట్టవచ్చని 2020లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో జంతువులను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే తొలి విడత నమీబియా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేసినప్పటికీ, ప్రత్యేక విమానం ద్వారా ఎనిమిది చిరుతలే దేశానికి వచ్చాయి. మిగిలిన చిరుతలను తీసుకురావటంతో పాటు, ప్రతీయేటా పన్నెండు చిరుతలను దేశానికి రప్పించేలా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో 12 చిరుతలతో కూడిన తొలి బ్యాచ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రం ప్రభుత్వం ప్రణాళిక పక్కాగా అమలైతే రాబోయే పదేళ్లలో దేశంలో చిరుతల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.