Female Cheetahs: అరణ్యంలోకి ప్రవేశించిన మరో రెండు చీతాలు.. క్వారంటైన్ పూర్తి కావడంతో విడిచిపెట్టిన అధికారులు

గత సెప్టెంబర్‌లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. దీంతో అధికారులు వరుసగా వాటిని అడవిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే రెండు చీతాల్ని విడిచిపెట్టిన అధికారులు, సోమవారం మరో రెండు చీతాల్ని వదిలేశారు.

Female Cheetahs: అరణ్యంలోకి ప్రవేశించిన మరో రెండు చీతాలు.. క్వారంటైన్ పూర్తి కావడంతో విడిచిపెట్టిన అధికారులు

Updated On : November 28, 2022 / 6:45 PM IST

Female Cheetahs: గత సెప్టెంబర్‌లో నమీబియా నుంచి దేశంలోకి ఎనిమిది చీతాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మధ్య ప్రదేశ్, కూనో నేషనల్ పార్కులో ప్రధాని మోదీ ఎనిమిది చీతాల్ని ప్రత్యేక ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టారు. వీటిలో మూడు మగ చీతాలు కాగా.. ఐదు ఆడ చీతాలు.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఇవి మన దేశ వాతావరణానికి అలవాటుపడే వరకు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డ తర్వాత నెమ్మదిగా వాటిని అడవిలోకి వదిలేస్తారు. అలా అధికారులు గతంలో రెండు మగ చీతాల్ని అడవిలోకి వదిలిపెట్టారు. తాజాగా సోమవారం మరో రెండు ఆడ చీతాల్ని అడవిలోకి వదిలేశారు. వీటి క్వారంటైన్ పూర్తి కావడంతో ఎన్‌క్లోజర్ల నుంచి అడవిలోకి విడిచిపెట్టారు. ఇవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది చీతాల్లో నాలుగు అడవిలోకి వెళ్లిపోయాయి. మిగతా నాలుగింటిని కూడా త్వరలోనే విడిచిపెడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు ఆడ చీతాలు.. ఒక మగ చీతా ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. వీటిని అధికారులు పూర్తి స్తాయిలో పర్యవేక్షిస్తున్నారు.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

అలాగే అడవిలోకి వదిలేసిన చీతాల్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. వీటి మెడకు అమర్చిన రేడియో కాలర్ల ద్వారా వాటి ఆరోగ్యాన్ని నిరంతరం సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం చీతాల్ని విడిచిపెట్టిన అడవి దాదాపు 92 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇప్పటికే అడవిలోని అనేక చోట్ల హెచ్‌డీ కెమెరాల్ని ఫిక్స్ చేశారు. వాటి ద్వారా చీతాల్ని గమనిస్తూ ఉంటారు.