ఒకే వేదికపై, ఒకే ముహుర్తానికి తల్లీ కూతుళ్ల….పెళ్లిళ్లు

  • Published By: murthy ,Published On : December 12, 2020 / 04:29 PM IST
ఒకే వేదికపై, ఒకే ముహుర్తానికి తల్లీ కూతుళ్ల….పెళ్లిళ్లు

mass marriage event in gorakhpur : ఈ వార్త మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఒకే వివాహ వేదికపై, ఒకేముహర్తానికి తల్లీ కూతుళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈవార్త ఇప్పుడ గోరఖ్ పూర్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములు…..లేదా అక్కచెల్లెళ్లు….. మరీ అయితే ఇద్దరు స్నేహితులు.. తమ పెళ్లిళ్లు ఒకేసారి జరుపుకోవాలని ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తల్లీ,కూతుళ్లిద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే కూమార్తెకు మొదటి వివాహం కాగా తల్లికి ద్వితీయ వివాహం.

ఉత్తర్​ప్రదేశ్​ లోని గోరఖ్​పుర్​ జిల్లాలో.. తల్లీకూతుళ్లు ఒకేసారి తమ పెళ్లిళ్లు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు వీరి పెళ్లిళ్లు ఒకే మండపంలో జరగడం విశేషం.పిప్రౌలి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ.. ‘ముఖ్యమంత్రి సాముహిక్​ వివాహ్​ యోజన’ కింద మొత్తం 63 వివాహాలు జరిగాయి. ఇందులో భాగంగానే తల్లీకూతుళ్ల వివాహాలు జరిగాయి.  బేలా దేవి(53).. భర్త హరిహర్ 25 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 25 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె.. ఆఖరు కుమార్తె ఇందూ(27)కు మినహా మిగిలిన అందరికీ వివాహాలు జరిపించింది.

రాష్ట్ర ప్రభుత్వం గురవారం నాడు నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో తల్లి బేలీదేవీ, కుమార్తె ఇందూ వివాహాలు చేసుకున్నారు. బేలీ దేవీ తన భర్త హరిహార్ సోదరుడు జగదీశ్​ (55)ను వివాహం చేసుకోగా….ఇందూ, రాహుల్ (29) ను వివాహం చేసుకుంది. జగదీష్ వ్యవసాయం చేస్తాడు. అవివాహితుడు. నా తల్లి పెళ్లి విషంలో మా కుటుంబ సభ్యులకెవరికీ సమస్య లేదు. ఎందుకంటే మా బాబాయి చిన్నప్పటి నుంచి మమ్మలందరినీ చూసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండటం మాకు సంతోషమే అని ఇందూ అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

“రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సాముహిక్​ వివాహ్​ యోజన కింద పేదలు, వితంతువులకు వివాహాలు జరిపించడం సంతోషకరం” అని సాంఘిక సంక్షేమ అధికారి సప్త్రాష్​ కుమార్ తెలిపారు. ఈ సామూహిక వివాహా వేడుకలో 63 జంటలు ఒకింటివారయ్యారు.