Shocking video : ఆక్సిజన్ ఆపేసి కరోనా రోగి ప్రాణాలు తీసిన ఆస్పత్రి సిబ్బంది

Shocking video : ఆక్సిజన్ ఆపేసి కరోనా రోగి ప్రాణాలు తీసిన ఆస్పత్రి సిబ్బంది

Oxygen Supply Unplugged..covid Patient's Death (1)

MP Hospital Oxygen Supply Unplugged Covid Patient Death : కరోనా సోకి ఆస్పతికి వెళితే ప్రాణాలతో తిరిగి వస్తోరో రారోనని బాధితుల కుటుంబ సభ్యులు భయాందోళనలతో బతుకుతున్న పరిస్థితి. అటువంటిది కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందటానికి వచ్చిన రోగుల ప్రాణాలు సాక్షాత్తూ వైద్య సిబ్బందే తీసేస్తే పరిస్థితులే వస్తే ఇక రోగులు ఎక్కడికెళ్లాలి? ఏం చేయాలి? సరిగ్గా అటువంటి ఘటన జరిగింది మధ్యప్రదేశ్ లోని ఓ ఆస్పత్రిలో..ఓ వార్డు బాయ్ రాత్రి సమయంలో కరోనా పేషెంటుకు అమర్చిన ఆక్సిజన్ తీసివేశాడు. దీంతో సదరు బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కరోనా మహమ్మారితో భారత్ పోరాడుతూనే ఉంది. తగ్గినట్లే తగ్గి సెకండ్ వేవ్ లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో ఐసీయూలు, ఆక్సిజన్ బెడ్‌లు, సాధారణ వార్డులు పూర్తిగా నిండిపోగా.. కరోనాకు బలైనవారి మృతదేహాలను భద్రపరచడానికి మార్చురీలు సరిపోవట్లేదు. ఎన్నో ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఉంది. చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఇటువంటి విషాదకర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోవడం ఒక ఎత్తయితే.. ఆస్పత్రి నిర్లక్ష్యం చేజేతులా ఓ మనిషి నిండు ప్రాణాలు తీసింది. ఆస్పత్రి సిబ్బంది ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. వారి కుటుంబంలో విషాదాన్ని నింపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కరోనా బాధితుడికి ఆక్సిజన్‌ను నిలిపివేయడంతో చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపించగా.. దీనిని హాస్పిటల్ యాజమాన్యం మొదట అంగీకరించలేదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావటంతో ఒప్పుకోకతప్పలేదు.

దీనిపై మృతుడి కొడుకు మాట్లాడుతూ..మంగళవారం (ఏప్రిల్ 13,2021) రాత్రి 11.30 గంటలకు వరకూ మా నాన్నతోనే ఉన్నానని ఆ తరువాత నేను ఇంటికి వెళ్లిపోగా..మీనాన్న పరిస్థితి విషమంగా ఉందని మరునాడు ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు.‘గత రెండు మూడు రోజులుగా నాన్న ఆరోగ్యం బాగా ఉంది. ఆహారం తీసుకుంటున్నారు.. కానీ, మంగళవారం రాత్రి ఆక్సిజన్‌ను సిబ్బంది ఆపేశారు..అందుకే బుధవారం ఉదయం మా నాన్న చనిపోయారు. ఇదంతా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనంటూ వాపోయాడు. బుధవారం ఉదయం తనకు ఫోన్ వచ్చిన వెంటనే హాస్పిటల్ కు వెళ్లానని మా నాన్నకు ఆక్సిజన్ పెట్టాలని సిబ్బందిని ప్రాధేయపడినా వారు వినలేదని ఏమాత్రం పట్టించుకోలేదని కన్నీటితో చెప్పాడు. తర్వాత ఐసీయూకి తరలించిన 15 నిమిషాల్లోనే ఆయన ప్రాణాలు పోయాయని దీనికి కారణం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని వాపోయాడు.

మృతుడికి ఆక్సిజన్‌ను తొలగించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో వృద్ధుడి బెడ్ వద్ద ఓ ఆరోగ్య కార్యకర్త నిలబడి ఉంది.. సహాయం కోసం తన సహచరులను పిలుస్తోంది.. అదే సమయంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే బటన్‌ను (ఆఫ్ చేయటం) నొక్కడం కనిపించింది…!!కోవిడ్ వార్డులలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు సాధారణంగా పీపీఈ కిట్‌ను ధరిస్తారు.. కానీ..సదరు వ్యక్తి మాత్రం పీపీఈ కిట్స్ ధరించలేదు. అతను బటన్ నొక్కిన తరువాత ఆక్సిజన్ నిలిచిపోవడంతో సదరు కరోనా రోగి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు స్పష్టంగా వీడియోలో రికార్డయ్యింది.

తాము రోగి ఆక్సిజన్ సరఫరా నిలిపివేయటం అవాస్తవమని ఆస్పత్రి ఉన్నతాధికారులు కూడా అంగీకరించలేదు. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని నిజాలు కావని బుకాయించారు. కానీ .. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు విషయం బైటపడింది. దీంతో సర్జన్ విభాగం చీఫ్ డాక్టర్ అనంత్ కుమార్ రాథోడ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. దీనికి సంబంధించి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.