Below 12 Years : ముందుగా 12 ఏళ్ల పిల్ల‌లున్న త‌ల్లిదండ్రుల‌కు వ్యాక్సినేష‌న్‌ : సీఎం ప్రకటన

కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుందనే అంచనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులకే ముందుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.

Below 12 Years : ముందుగా 12 ఏళ్ల పిల్ల‌లున్న త‌ల్లిదండ్రుల‌కు వ్యాక్సినేష‌న్‌ : సీఎం ప్రకటన

Madhyapradesh Govt

Below 12 years age childrens : కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలున్న తల్లిదండ్రులు. థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్న క్రమంలో భయాందోళనలకు గురవుతున్నారు. పెద్దలకు కరోనా సోకితే వారిని వారు చూసుకోగలరు. ఈక్రమంలో మధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

12 ఏళ్లలోపు పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రుల‌కు వ్యాక్సినేష‌న్‌లో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. థర్డ్ వేవ్‌లో క‌రోనా మహమ్మారి పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూప‌నుంద‌న్న అంచనాల మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ామని సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ వెల్ల‌డించారు. పిల్ల‌ల‌కు వైర‌స్ సోకితే వారిని సంరక్షించుకోవటానికి కంటికి రెప్పలా కాచుకోవటానికి వారి త‌ల్లిదండ్రులు వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోవటానికి ఉంటుందని తెలిపారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో సెకండ్ వేవ్‌ను క‌ట్ట‌డి చేసినా.. మూడో వేవ్ వ‌స్తుంద‌న్న ఆందోళ‌న ఉన్న‌ద‌ని శివ‌రాజ్ అన్నారు. అందుకే పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా వార్డులు ఏర్పాటు చేసి..ఆరోగ్య సేవ‌ల‌ను నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే విదేశాల‌కు వెళ్లే విద్యార్థుల‌కు కూడా వ్యాక్సిన్‌ను ప్రాధాన్య‌ను ఇస్తామని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్ లో జూన్ 3న కొత్తగా 846 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 50 మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.