సిక్సుల వర్షం కురిపించిన ధోని.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి..? ఇప్పుడు ధోనీ మ్యాచ్ లు ఏమీ ఆడట్లేదు కదా.. మరి ఈ సిక్సర్ల వర్షం ఏంటి. అనే సందేహం వచ్చింది కదూ..

సిక్సుల వర్షం కురిపించిన ధోని.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Ms Dhoni Hits Sixes

ms dhoni hits sixes: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి..? ఇప్పుడు ధోనీ మ్యాచ్ లు ఏమీ ఆడట్లేదు కదా.. మరి ఈ సిక్సర్ల వర్షం ఏంటి. అనే సందేహం వచ్చింది కదూ. ఐపీఎల్ ట్రైనింగ్ క్యాంప్ లో ధోని ఈ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ సమయంలో ధోని సిక్సర్లతో చెలరేగాడు.

దాదాపు గంట సేపు ప్రాక్టీస్‌ కొనసాగించిన ధోని… ప్రాక్టీస్‌ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది. ధోని ఒక్కో షాట్‌ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది(2020) రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని.. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఈ ఐపీఎల్ లో బ్యాట్‌ ఝుళిపించాలని తీవ్రంగా సాధన మొదలెట్టాడు. కొద్దిరోజుల క్రితమే చెన్నైకి చేరుకున్న మహీ తాజాగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌పట్టిన తొలిరోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. తమ ఆరాధ్య క్రికెటర్‌ను మళ్లీ మైదానంలో ఇలా చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్ కోసం గత మార్చిలో చెన్నైకి చేరుకొని కొద్దిరోజులు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే, అప్పుడు లాక్‌డౌన్‌ విధించగా ఐపీఎల్‌ ఆరు నెలలు వాయిదా పడింది. చివరికి గతేడాది(2020) సెప్టెంబర్‌-నవంబర్‌ కాలంలో యూఏఈలో జరిగింది. అంతకుముందే మహీ చెన్నైలో రెండోసారి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే దారుణంగా విఫలమైంది. ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది.

మొత్తం 14 మ్యాచుల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ధోనీ సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. కాగా, ఈ ఏడాది(2021) ఐపీఎల్‌ సీజన్‌ భారత్‌లో జరగడం సీఎస్‌కేకి కలిసొచ్చే అంశం. మరి ఈ సీజన్‌లో ధోనీ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.