చెల్లెళ్ల Online క్లాసుల కోసం టీ అమ్ముతున్న 14ఏళ్ల బాలుడు

  • Published By: nagamani ,Published On : October 30, 2020 / 04:18 PM IST
చెల్లెళ్ల Online క్లాసుల కోసం టీ అమ్ముతున్న 14ఏళ్ల బాలుడు

Mumbai : కరోనా మహమ్మారి వల్ల వచ్చి లాక్ డౌన్ ఎంతోమంది ఉద్యోగాలు..ఉపాధులపై దెబ్బకొట్టింది. ఎన్నో కుటుంబాలు లాక్ డౌన్ దెబ్బకు కుదేలైపోయాయి. ముంబైకి చెందిన సుభాన్‌ అనే 14ఏళ్ల బాలుడి కుటుంబం కూడా ఒకటి. కరోనా తెచ్చినకష్టంతో సుభాన్ తల్లి ఉద్యోగం పోవటంతో ఆ కుటుంబం బతకడం కష్టంగా మారింది. రోజుగడవటమే భారమైపోయింది.


దీంతో 14 ఏళ్ల చిన్న వయస్సులో సుభాన్‌ కుటుంబాన్ని పోషించే పెద్దగా మరాల్సి వచ్చింది. తన చెల్లెలుకి ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పించడం కోసం టీ అమ్మడం మొదలు పెట్టాడు. కనీసం టీషాపు పెట్టుకునే పరిస్థితి లేకపోవటం సుభాన్ ఇంట్లోనే టీ తయారు చేసి వీధుల్లో తిరుగుతూ టీ అమ్ముతున్నాడు.


12 ఏళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. పిల్లల కోసం సుభాన్ తల్లి అటెండర్ గాపనిచేస్తు వచ్చే కొద్దిపాటి జీతంతో బతుకుతున్నారు. ఈక్రమంలో వచ్చిన లాక్ డౌన్ తో ఆమె ఉద్యోగం పోయింది. దీంతో వారి పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. దీంతో సుభాన్..చదువు మానేశాడు. తన చెల్లెళ్లను చదివిస్తున్నాడు. తాను..చెల్లెళ్లు చదువుకోవాలంటే కుదురే పరిస్థితి లేదు. ఎందుకంటే చదువులు ఆన్ లైన్ అయిపోయాయి. ఇద్దరు చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్లు కావాలి. కానీ అంత స్తోమత వారికి లేదు.


దీంతో సుభాన్ తన కుటుంబం కోసం..చెల్లెలు ఆన్ లైన్ క్లాసుల కోసం టీ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ టీలు అమ్మితే రోజుకు మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వస్తాయని ఆ డబ్బులతోనే తన కుటుంబం బతకాలి.


ప్రస్తుతం తాను టీలు అమ్మిన డబ్బులతోనే తన చెల్లెళ్లు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అయి చదువుకుంటున్నారనీ..స్కూల్‌ తెరవగానే తను కూడా స్కూల్‌కి వెళతానని తెలిపాడు. చదువుకోవాల్సిన చిన్న వయసులో సుభాన్‌ ఇలా కుటుంబం కోసం కష్టపడటం దురదృష్టకరం.