Mumbai Man: నీకు ఆమెతో ఎఫైర్‌ ఉంది.. 10 లక్షలు ఇవ్వు

Mumbai Man: నీకు ఆమెతో ఎఫైర్‌ ఉంది.. 10 లక్షలు ఇవ్వు

Mumbai Man

Mumbai Man: సమాజంలో మోసాలు పెరిగిపోయాయి.. మోస పోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారికి కొదవే ఉండదు.. ఇదిలా ఉంటే తన అప్పులు తీర్చుకునేందుకు ఓ వ్యక్తిని మోసం చెయ్యాలని చూశాడు ఓ వ్యాపారి.. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన తుషార్‌ సిల్వంత్‌ అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టం వచ్చింది.

ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోవడంతో భార్య కూడా అతడిని వదిలేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు తుషార్‌ సిల్వంత్‌. ఒంటరిగా కొద్దిరోజులు గడిపాడు. తన భార్య మసాజ్ పార్లర్ లో పనిచేస్తుందని, ఆమె అక్కడ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తుషార్‌ సిల్వంత్‌ కు సన్నిహితుల ద్వారా తెలిసింది.

దీనినే తనకు అనుకూలంగా మార్చుకొని డబ్బు లాగి తన అప్పు తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఎలాగోలా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్ సంపాదించాడు. అతడికి ఫోన్ చేసి తాను క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అని పరిచయం చేసుకున్నాడు. మసాజ్‌ పార్లర్‌లో పని చేస్తున్న ఆమెతో నీకు ఎఫైర్‌ ఉంది. చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.10లక్షలు పంపు అని బెదిరించాడు.

దీంతో సదరు వ్యక్తి భయపడి రూ. 5 లక్షలు పంపాడు. మరో ఐదు లక్షల కోసం కొద్దీ రోజుల తర్వాత ఫోన్ చేశాడు తుషార్‌ సిల్వంత్‌. రూ. 5 లక్షలు పంపాలని తెలిపాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తుషార్ ను పట్టుకున్నారు. ఈ కేసుతో భార్యకు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.