రంగస్థల నాటకంలో షాకింగ్ ఘటన.. పాత్రలో లీనమైపోయి త్రిశూలంతో హత్యాయత్నం

రంగస్థల నాటకంలో షాకింగ్ ఘటన.. పాత్రలో లీనమైపోయి త్రిశూలంతో హత్యాయత్నం

murder attempt in a play: కర్నాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో ఊహించని ఘటన జరిగింది. అందరిని షాక్ కి గురి చేసింది. ఒళ్లంతా చెమట్లు పట్టించింది. నాటకంలో ఓ పాత్రధారికి ప్రాణం పోయినంత పనైంది.

అసలేం జరిగిందంటే.. నాటకంలో భాగంగా చాముండేశ్వరి పాత్ర ధరించిన ఓ వ్యక్తి అందులో లీనమైపోయాడు. మహీషుడి పాత్రలో ఉన్న మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 6న మాండ్యలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాటకం రసవత్తరంగా సాగుతోంది. పాత్రధారులు తమ పాత్రల్లో లీనమైపోయారు. జనాలంతా ఆసక్తిగా చూస్తున్నారు. చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి మహీషుడి పాత్రలో ఉన్న వ్యక్తిని కిందకు పడేశాడు. ఆ తర్వాత డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగని అతడు.. త్రిశూలంతో మహీషుడి పాత్రలో ఉన్న వ్యక్తిని పొడిచేందుకు యత్నించాడు. ఇది చూసి నిర్వాహకులు బిత్తరపోయారు. ఆ వెంటనే తేరుకుని… ఆ వ్యక్తిని అడ్డుకోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

మహీషుడి పాత్రలో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి అందులో లీనమవడమే హత్యాయత్నానికి కారణమని చెబుతున్నారు. కొద్దిలో ప్రాణాపాయం తప్పడంతో మహీషుడి పాత్రధారి ఊపిరిపీల్చుకున్నాడు. అడ్డుకోవడం నిర్వాహకులు ఏమాత్రం ఆలస్యం చేసినా.. జరగరాని ఘోరం జరిగిపోయేది.