ఢిల్లీ అల్లర్లలో సిక్కుల సేవలకు గౌరవంగా, సిక్కు తలపాగా ధరించి పెళ్లి చేసుకున్నముస్లిం యువకుడు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 04:39 AM IST
ఢిల్లీ అల్లర్లలో సిక్కుల సేవలకు గౌరవంగా, సిక్కు తలపాగా ధరించి పెళ్లి చేసుకున్నముస్లిం యువకుడు

ఓ ముస్లిం యువకుడు సిక్కులు ధరించే తలపాగా చుట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా వివాహం చేసుకున్నాడని..వధువు తండ్రి వెల్లడించారు. ఇతను ముస్లింలకు ఎందుకు కృతజ్ఞతలు తెలిపాడు ? ఇలా వివాహం ఎందుకు చేసుకున్నాడు ? 
ఇటీవలే ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఎంతో మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

రెండు వర్గాలకు మధ్య జరిగిన హింస తీవ్ర కలకలం రేపింది. కొంతమంది రంగంలోకి దిగి…ఎంతోమందిని రక్షించారు. అందులో సిక్కులు కూడా పాల్గొన్నారు. సిక్కు మతానికి చెందిన ఓ తండ్రి కొడుకులు 70 మంది ముస్లింలను రక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…పంజాబ్‌లోని గిద్దర్ బాహా పట్టణంలో అబ్దుల్ అనే ముస్లిం యువకుడి వివాహం జరుగుతోంది. అందులో యువకుడు..సిక్కులు ఉపయోగించే తలపాగా చుట్టుకున్నాడు.

మతసామరస్యాన్ని తెలియచేసేందుకు ఇలా చేశాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. ముస్లింలను రక్షించినందుకు సిక్కులకు గౌరవార్థం ఇవ్వాలని..అందుకే తాను తలపాగా ధరిస్తానని వివాహానికంటే ముందుగానే చెప్పాడని తెలిపారు. అబ్దుల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, స్వాగతించామని..ఇలా చేయడం సంతోషంగా ఉన్నామన్నారు. 

Read More : ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు