MVA Meet: మహారాష్ట్రకు కిక్ ఇచ్చిన కర్ణాటక.. పవార్ ఇంట్లో ప్రతిపక్షాల కీలక భేటి

ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది

MVA Meet: మహారాష్ట్రకు కిక్ ఇచ్చిన కర్ణాటక.. పవార్ ఇంట్లో ప్రతిపక్షాల కీలక భేటి

Maharashtra Politics: దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే అధికారంతో పాటు, పట్టున్న రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోవడంతో మిగతా ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు ఇది మంచి బూస్ట్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత

ఆదివారం నాటి ఈ సమావేశంలో మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలనే దృఢ సంకల్పాన్ని ఎంపీఏ నేతలు ఏర్పరుచుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పవార్ నివాసంలో జరిగిన ఎంవీఏ సమావేశంలో ఆయనతో పాటు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన వర్గం ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అజిత్ పవార్, బాలాసాహెబ్ థోరట్ తదితర నేతలు పాల్గొన్నారు. 2024 లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఫార్ములా గురించి ప్రధానంగా నేతలు చర్చించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.