Mysterious Sounds: భూగర్భం నుంచి వస్తున్న వింత శబ్దాలు.. భయాందోళనలో గ్రామస్తులు

కొద్ది రోజులుగా ఆ ఊరిని వింత శబ్దాలు భయపెడుతున్నాయి. భూగర్భం నుంచి వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలతో ఊరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ ఊళ్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Mysterious Sounds: భూగర్భం నుంచి వస్తున్న వింత శబ్దాలు.. భయాందోళనలో గ్రామస్తులు

Mysterious Sounds: మహారాష్ట్రలోని ఒక గ్రామంలో కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలు ఆ ఊరి వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హసోరి గ్రామంలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 6 నుంచి భూగర్భం నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు.

AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ

వింతగా వినిపిస్తున్న శబ్దాలతో హసోరి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నరు. శబ్దాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక భయపడుతున్నారు. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. జిల్లా అధికారులు ఈ శబ్దాలను పరిశీలించి అసలు విషయం తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నెటిజమ్‌కు చెందిన నిపుణులు బృందం ఈ అంశాన్ని పరిశీలించేందుకు రానుంది. అలాగే నాందేడ్‌లోని స్వామి రామానంద్ థీర్థ్ మరఠ్వాడా యూనివర్సిటీకి చెందిన నిపుణులు కూడా దీనిపై అధ్యయనం చేయనున్నారు. మంగళవారం.. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ ఈ గ్రామాన్ని సందర్శించారు.

Sourav Ganguly, Jay Shah: జై షా, సౌరవ్ గంగూలీకి సుప్రీంకోర్టు ఊరట.. పదవుల్లో తిరిగి కొనసాగేలా తీర్పు

త్వరలోనే ఈ విషయంలో శాస్త్రీయమైన విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. గ్రామస్తులు ఈ విషయంలో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ గ్రామం కిలారి అనే చిన్న పట్టణానికి చాలా దగ్గరగా ఉంది. కిలారి ప్రాంతంలో 1993లో భారీ భూకంపం సంభవించి 9,700 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఈ ప్రాంతంలో భూకంపం తిరిగి రాలేదని అధికారులు అంటున్నారు.