నిత్యానంద దేశం

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 02:21 AM IST
నిత్యానంద దేశం

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈక్వేడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి..దానికి కైలాస అని పేరు పెట్టారని తెలుస్తోంది. ట్రినిడాడ్ అండ్ టుబాగోకు దగ్గర్లోని ద్వీప దేశానికి ఒక పాస్ పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారంట. ప్రధానిగా మానిని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్ పోర్టును రూపొందిచారని తెలస్తోంది.

కైలాసకు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని నిత్యానంద..ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది. హిందూత్వ పునరద్ధణ కోసం కృషి చేస్తుందని వెబ్ సైట్ వెల్లడించిది. దేశ పౌరసత్వం కావాలని అనుకొనే వారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపరిచారు. మెరూన్ కలర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చొని ఉండగా..పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. మొత్తం ప్రభుత్వంలో 10 శాఖలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

తమ దేశంలో ఫ్రీగానే భోజనం, విద్య, వైద్య లభిస్తాయని ఆ వెబ్ సైట్ వెల్లలడించింది. ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై ప్రధానంగా దృష్టి పెడుతామని ఆ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఒక భావోన్మాత్మక దేశం, శాంతి, స్వేచ్చ, సేవాతత్పరతల దేశం, ఏ దేశ అధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద నకిలీ పాస్ పోర్టుతో భారత్ నుంచి పారిపోయారు. 
Read More : వాద్రాకు భయమేస్తుంది: ప్రియాంక గాంధీ సెక్యూరిటీ లేదు.. కూతురికి ఏమవుతుందో..