Nitish Kumar: వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో.. నితీశ్ కుమార్ సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా?

బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.

Nitish Kumar: వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో.. నితీశ్ కుమార్ సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా?

Nitish Kuamar, Opposition Leaders

Nitish Kumar – One On One Strategy : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గగ్దె దించడానికి విపక్షాలు ఏకమవుతున్నాయా..? ఈ పనిని బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ తన భుజాన వేసుకున్నారా..? దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో నితీశ్ వరుస సమావేశాలు ఎంత వరకు ఫలితాలను ఇస్తున్నాయి..? కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు (regional parties) కలిసి బీజేపీని ఎలా ఎదుర్కోబోతున్నాయి? దీనికి ఇటు కాంగ్రెస్‌తో.. అటు ప్రాంతీయ పార్టీలతో కలిసి నితీశ్ చేస్తున్న మంత్రాంగం ఏంటి..? బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ప్లాన్ కొలిక్కి వస్తుందా?

విపక్షాలను ఏకం చేసేందుకు నితీశ్ ప్లాన్స్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత కోసం జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో థర్డ్ ఫ్రంట్ (third Front) అంటూ మాట్లాడిన పార్టీలను కాంగ్రెస్‌తో జతకలిపేందుకు ప్రయత్నిస్తున్నారు నితీశ్. అప్పుడే బీజేపీ కంచుకోటను ఢీకొట్టమనే సందేశాన్ని ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారు. హస్తం పార్టితో చేతులు కలిపి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ కుమార్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో నితీశ్ సమావేశమయ్యారు.

విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ వరుస సమావేశాలు
విపక్షాలను ఐక్యం చేసేందుకు ఇప్పటికే నితీశ్ కుమార్.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో విపక్షాల ఐక్యత, బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం, పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఇప్పుడు రాహుల్, ఖర్గేతో సైతం ఇదే అంశంపై చర్చించారని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు.

siddaramaiah sworn
ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యమనే క్లారిటీ

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని విపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఒకే వేదికపై అందరూ చేతులు కలిపి.. డైరెక్ట్‌గానే తామంతా ఒక్కటే అనే మెసేజ్ ఇచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలను సైతం కలిపేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిప‌క్షాలు ఐక్యం చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా.. గత రెండు మూడు నెలలుగా ఈ పనిని మరింత వేగం చేశారు నితీశ్ కుమార్. దీనిపై బీజేపీ నాయకులు నితీశ్‌ను ఎంతలా టార్గెట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాల ఐక్యతే తన లక్ష్యమని క్లారిటీగా చెప్పేస్తున్నారు.

Also Read: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 ప్రతిపక్ష పార్టీలు.. ఎందుకో తెలుసా?

వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో సరికొత్త వ్యూహం
రాహుల్, ఖర్గేతో జరిగిన భేటీలో విపక్ష నేతలందరినీ కలిపిపేందుకు పాట్నాలో నితీశ్ ఓ సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అన్ని రాష్ట్రాల్లో బలంగా లేదు. కానీ దాదాపు అన్నిచోట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. దీని వల్ల ఓట్లు చీలి, అంతిమంగా బీజేపీకి లాభం జరుగుతోంది. దీనికి విరుగుడుగానే నితీశ్‌ వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్‌ మాత్రమే పోటీచేయాలన్నది నితీశ్ ప్లాన్‌గా భావిస్తున్నారు.

Also Read: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా రూ.10వేల కోట్ల సాయం

బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం. గతంలో థర్డ్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్న పార్టీలను సైతం దీనికి నితీశ్‌ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా మమతా బెనర్జీ (Mamata Banerjee)తో నితీశ్ సమావేశంలో కూడా దీదీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మద్దతిస్తాం అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఫార్ములాకు ఒప్పుకుంటే ప్రాంతీయ పార్టీల్లో మెజార్టీ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి.

కేసీఆర్‌ను ఎలా ఒప్పిస్తారు?.. వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి..