మహారాష్ట్రలో పొలిటికల్ మంటలు.. పవార్‌తో అమిత్ షా భేటీ?

మహారాష్ట్రలో పొలిటికల్ మంటలు.. పవార్‌తో అమిత్ షా భేటీ?

Amit Shah

Amit Shah:కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో NCP అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్‌సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ, మరోవైపు దేశంలో ఒక దిగ్గజ నేతగా రాజకీయాలకు అతీతంగా పవార్‌కు విస్తృత సంబంధాలు ఉంటాయని చెప్తోంది. ఇక లేటెస్ట్‌గా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.

పవార్‌తో భేటీపై స్పందించేందుకు నిరాకరించిన అమిత్ షా… అన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. దీన్నిబట్టి అమిత్ షా-పవార్ భేటీ నిజమేననే వాదన బలంగా వినిపిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ విషయంలో NCP వైఖరిపై శివసేన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. అనిల్ దేశ్‌ముఖ్‌ను యాక్సిడెంటల్ హోంమంత్రిగా తన మౌత్ పీస్ సామ్నాలో శివసేన ఎగతాళి చేసింది.

అవినీతి ఆరోపణలు, అనేక సందేహాలు చుట్టుముట్టిన తర్వాత ఇంకా ఆ కుర్చీలో ఎలా కొనసాగుతారని దేశ్‌ముఖ్‌ను కాపాడుతున్న NCPను ప్రశ్నించింది. సచిన్ వాజే లాంటి ఒక అధికారి వసూళ్ల దందా నడుపుతున్నప్పుడు హోంమంత్రికి దాని గురించి తెలియకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నప్పుడు.. ఎవరూ దాన్ని చెడగొట్టేలా వ్యవహరించకూడదంటూ పరోక్షంగా పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు అనుమానిస్తుంది. ఇదే సమయంలో పవర్‌ అమిత్‌షా భేటీ అయ్యారన్న ప్రచారం శివసేనలో గుబులు రేపుతోంది.