సోనియా మెప్పు కోసం! : కర్ణాకటలో 114అడుగుల జీసస్ విగ్రహం…బీజేపీపై డీకే సీరియస్

  • Published By: venkaiahnaidu ,Published On : December 28, 2019 / 09:45 AM IST
సోనియా మెప్పు కోసం! : కర్ణాకటలో 114అడుగుల జీసస్ విగ్రహం…బీజేపీపై డీకే సీరియస్

కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేలుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?

క్రిస్మస్ రోజు(డిసెంబర్-25,2019)కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కనకాపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ తన నియోజకవర్గంలోని హరో బెలే గ్రామంలోని కపాలిబెట్ట దగ్గర 114 అడగుల ఎత్తైన జీసస్ విగ్రహానికి ప్రారంభోత్సవం  చేశారు. అయితే శివకుమార్ జీసస్ విగ్రహా నిర్మాణం విషయమై శివకుమార్ పై అధికార బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జీసస్ విగ్రహ నిర్మాణం కోసం సిద్ధం చేసిన ల్యాండ్ డీకే శివకుమార్ ది కాదని, కమ్యూనిటీ ఉపయోగం కోసం ఉద్దేశించబడిన ఆ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక తెలిపారు. ఏ ఉద్దేశ్యంతో ఆ ల్యాండ్ తాను కొని వారికి ఇచ్చాను అని శివకుమార్ చెబుతున్నారో తనకు తెలియడం లేదని అశోక అన్నారు. ఆ ల్యాండ్ ను ఎవరూ ఎవరికి డొనేట్ చేయలేరన్నారు. రామనగర జిల్లా డిప్యూటీ కమిషనర్ ను ఈ విషయమై రిపోర్ట్ కోరానని ఆయన తెలిపారు.

అయోధ్యలో రామజన్మభూమిలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాటికన్ లో జన్మించిన తమ నాయకురాలు సోనియా మెప్పు కోసం పుణ్యభూమి అయిన భారత్ లో జన్మించి తన సొంత డబ్బులతో జీసస్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని మరో బీజేపీ నాయకుడు,రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప విమర్శించారు. ఇప్పుడు సిద్దరామయ్య కూడా శివకుమార్ ని కేపీసీసీ అధ్యక్షుడు కాకుండా ఆపలేడని ఈశ్వరప్ప అన్నారు. మైసూర్ బీజేపీ ఎంపీ సహా మరికొందరు అధికార పార్టీ నాయకులు శివకుమార్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

ఈ సమయంలో తనపై వస్తున్న విమర్శలపై డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీ వ్యాఖ్యలపై డీకే సీరియస్ అయ్యారు. తాను రాజకీయాల కోసం ఇది చేయలేదని, కేవలం ఆ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన మాటను మాత్రమే నెరవేర్చుతున్నానని శివకుమార్ అన్నారు. తమ ప్రాంతంలో అసలు జీసస్ విగ్రహం లేదని హరొబెలే గ్రామస్థులు చెప్పారని,తమకు జీసస్ విగ్రహం కావాలని వారు కోరారరని,తప్పకుండా దానికి సహాయం చేస్తాను అని తాను వారికి హామీ ఇచ్చానని శివకుమార్ అన్నారు. ఇచ్చిన మాటను తాను నెరవేర్చానని తెలిపారు. ఆత్మసంతృప్తి కోసం ఒక్క పని అయినా చేయాలి కదా అని శివకుమర్ అన్నారు. స్థలం మీకు చెందినది కాకపోతే జీసస్ విగ్రహ నిర్మాణం వద్దు అని స్థానికులతో తాను చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు.

తన నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఆలయాలను తాను నిర్మించానని,మూడు లొకేషన్లలో 30ఎకరాలకు పైగా తన ప్రాపర్టీని ప్రభుత్వ విద్యా సంస్థల కోసం తాను ఇచ్చానని,తాను ప్రాపర్టీలను కూడా కొని వివిధ సంస్థలకు వాటిని దానం చేశానని శివకుమార్ అన్నారు. తన సెక్యులర్ భావజాలాన్ని చూసి అసూయ చెంది కొందరు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. హెడ్ డీ కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో సంబంధిత ల్యాండ్ ను తాను కొనుగోలు చేయడం జరిగిందని విమర్శకులకు డీకే సమాధానమిచ్చారు.