Reliance : అంబానీ కుటుంబం లండన్ కి వెళ్లిపోతుందన్న వార్తలపై రిలయన్స్ క్లారిటీ

భార‌త కార్పొరేట్ దిగ్గ‌జం,ఆసియాలో నెం.1 ధనవంతుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ..త్వ‌ర‌లో లండ‌న్‌కు త‌న కుటుంబాన్ని షిఫ్ట్ చేయ‌నున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రిలయన్స్

Reliance : అంబానీ కుటుంబం లండన్ కి వెళ్లిపోతుందన్న వార్తలపై రిలయన్స్ క్లారిటీ

Mukesh2

Ambani Family :  భార‌త కార్పొరేట్ దిగ్గ‌జం,ఆసియాలో నెం.1 ధనవంతుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ..త్వ‌ర‌లో లండ‌న్‌కు త‌న కుటుంబాన్ని షిఫ్ట్ చేయ‌నున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖేష్‌ అంబానీకి, అతని కుటుంబానికి లండన్ లేదా ప్రపంచంలో మరెక్కడా నివసించాలనే ప్రణాళికలు లేవని ఆ ప్రకటనలో రిలయన్స్ సృష్టించింది.

లండన్‌లోని బకింగ్‌ హామ్‌లో గల స్టోక్‌ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని అంబానీ కొనుగోలు చేసింది నిజమేనని.. అయితే దానిని ప్రధాన గోల్ఫింగ్ కేంద్రంగా, స్పోర్టింగ్ రిసార్ట్‌గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో రిలయన్స్ స్పష్టం చేసింది. అక్కడి ప్లానింగ్ మార్గదర్శకాలు, స్థానిక నిబంధనలను పూర్తిగా పాటిస్తూనే హెరిటేజ్ ప్రాపర్టీని రిలయన్స్ కోనుగోలు చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తునట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ ప్రకటనలో తెలిపింది.

కాగా, అంబానీ లండన్‌లోని బకింగ్‌ హామ్‌లో గల స్టోక్‌ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని… ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్‌ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లతో సొంతం చేసుకున్నట్లు..ఇకపై ఈ ఇంట్లోనే అంబానీ కుటుంబం నివసించబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దీపావ‌ళి వేడుక‌ల‌ను లండ‌న్‌లో ఇటీవ‌ల నిర్మించిన కొత్త ఇంట్లోనే ముకేశ్ అంబానీ కుటుంబం జ‌రుపుకున్న‌ద‌ని ఓ ఆంగ్ల ప‌త్రిక ఓ కథనంలో పేర్కొంది. అయితే అంబానీ కుటుంబం భారత్ వదిలి ఎక్కడికి వెళ్లిపోవడం లేదంటూ రిలయన్స్ సృష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు అర్థరహితమని కొట్టిపారేసింది.

ALSO READ Exchange of Fire Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, మావోయిస్టు మృతి