భారత్‌ నుంచి ఒక్క బంగ్లాదేశీని పంపలేరు: బంగ్లాదేశ్

భారత్‌ నుంచి ఒక్క బంగ్లాదేశీని పంపలేరు: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్(బీజీబీ) చీఫ్ మేజర్ జనరల్ షఫీనుల్ ఇస్లామ్ NRCపై స్పందించారు. ఎన్నార్సీ అనేది భారత ప్రభుత్వ అంతర్గత విషయం. ‘ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అక్రమ వలసదారులు భారత్‌లోకి ప్రవేశిస్తే వాళ్లకు ముప్పు తప్పదు. అలా కాకుండా బంగ్లాదేశీలు అందరినీ భారత్ నుంచి పంపేయాలనుకుంటే అది వీలు కాని పని’ 

‘విలువైన పత్రాలు లేకుండా ఆశ్రయం పొందిన 300మందిని అరెస్టు చేశారు. డీజీ స్థాయిలో చర్చలు జరిపి వారిపై నిర్ణయం తీసుకున్నాం’ అస్సాంలో ఎన్నార్సీ అమలు చేయడంతో పొరుగుదేశమైన అస్సాం అసంతృప్తితో ఉంది. ఇది భారత్ యొక్క అంతర్గత విషయమని ప్రభుత్వం ముందుగానే ప్రస్తావించింది. 

సెప్టెంబరులో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా షేక్ న్యూయార్క్ వేదికగా జరిగిన సదస్సులో ఇదే విషయంపై ప్రధాని మోడీతో చర్చించారని బంగ్లాదేశ్ ధీమాతో కనబడుతుంది. సీఏఏ, ఎన్నార్సీలపై భారత్‌లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న మాట వాస్తవమే. 2014 డిసెంబరు 31కు ముందు ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ల నుంచి వచ్చిన వారికి మతాలను బట్టి పౌరసత్వం కల్పించేలా ఉన్నాయంటూ ఈ అంశాలను వ్యతిరేకిస్తున్నారు.