నా డబ్బులు తీసేసుకుంటున్నాడు సార్ : 10 కిలోమీటర్లు నడిసొచ్చి తండ్రిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చిన్నారి

  • Published By: nagamani ,Published On : November 18, 2020 / 11:29 AM IST
నా డబ్బులు తీసేసుకుంటున్నాడు సార్ : 10 కిలోమీటర్లు నడిసొచ్చి తండ్రిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చిన్నారి

Odisha 11 yr old girl complaint against her father : ఒడిశాలో ఓ చిన్నారి తన తండ్రిపై ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదుచేసింది. నాకు వచ్చే డబ్బులన్నీ మా నాన్న తీసేసుకుంటున్నాడు సార్..దయచేసి నాకు న్యాయం చేయండి సార్..అంటూ కలెక్టరర్ ని కోరింది 11 ఏళ్ల బాలిక. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకుని 10 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ కలెక్టర్ ఆఫీసుకు వచ్చి..పేపర్ పై తనకు జరిగే అన్యాయం ఏంటో కూడా వివరంగా రాసి మరీ ఇచ్చింది.



ఆ బాలిక తండ్రిపై ఇచ్చిన ఫిర్యాదు విన్న కలెక్టర్ మొదట ఆశ్చర్యపోయారు. తరువాత విషయం తెలిసుకుని ఓ పాపా నీకు తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు ఇవ్వటమే కాదు ఆ తండ్రికి థమ్కీ ఇచ్చారు.



వివరాల్లోకి వెళితే..ఒడిశాలో కేంద్రపర ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న శుశ్రీ అనే 11 ఏళ్ల బాలిక ఆరవ తరగతి చదువుతోంది. శుశ్రీకి 11 ఏళ్లు. శుశ్రీకి తండ్రి తనకు చేస్తున్న అన్యాయం గురించి కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలనుకుంది.దాని కోసం ఏకం 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తన తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఏంచేస్తున్నాడో ఓ పేపర్ పై వివరంగా రాసి మరీ పట్టుకెళ్లింది.



https://10tv.in/covid-19-delhi-seeks-curbs-at-weddings-markets/
ప్రభుత్వం కరోనా కాలంలో విద్యాసంస్థలు మూసివేయటంతో ఇళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. కానీ మధ్యాహ్నా భోజనం పథకం కింద విద్యార్థులకు ఇచ్చే పథకాలను మాత్రం కొనసాగిస్తూ వస్తోంది. విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే నగదును నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. బియ్యాన్ని కూడా వారి ఇళ్లకే పంపిస్తోంది. అలాగే 6 th క్లాస్ చదివే శుశ్రీకి కూడా తన బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడేవి.


కానీ ఆ డబ్బును శుశ్రీ తండ్రి బలవంతంగా తీసేసుకునేవాడు. విషయం ఏమిటంటే శుశ్రీకి తల్లి చనిపోయింది. తండ్రి రమేశ్ మరో పెళ్లి చేసుకున్నాడు. శుశ్రీ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో తనకు వచ్చే డబ్బుల్ని కూడా తండ్రి బలవంతంగా తీసేసుకోవటంతో ఆ పాపకు నచ్చలేదు. తన బాగోగులు చూసుకోని తండ్రి తనకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకునే హక్కు ఎక్కడిది? అనేది ఆ చిన్నారి పాయింట్.


కరెక్టేకదా మరి బాధ్యతలు మరచితన తండ్రికి ఆ హక్కు ఎక్కడిది? అదే విషయాన్ని శుశ్రీ లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. నాకు అవసరాలున్నాయి డబ్బును ఇవ్వమని అడిగితే తన తండ్రి అడిగితే తన తండ్రి ఇచ్చే వాడు కాదని, తనకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో శుశ్రీ కోరింది.


ఆమె ఫిర్యాదును పరిశీలించిన కేంద్రపర కలెక్టర్ సమర్థ్ వర్మ మాట్లాడుతూ.. ఆమె అకౌంట్లో డబ్బును జమ చేయాలని డీఈవోకు ఆదేశాలు పంపామని..అంతేకాదు చిన్నారి శుశ్రీ తండ్రి తీసుకున్న ఇప్పటివ వరకూ తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని..బియ్యాన్ని కూడా శుశ్రీకి అందేలా చూడాలని డీఈవోను కలెక్టర్ ఆదేశించారు.


కాగా కరోనా మహమ్మారి సమయంలో స్కూల్స్ అన్నీ మూసివేయటంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వారు ఆకలితో ఉండకూడదనే మంచి ఉద్ధేశ్యంతో పథకాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తోంది సీఎం పినరాయి విజయన్ ప్రభుత్వం. ప్రతీ విద్యార్థినీ విద్యార్ధులకు రోజుకు 150 గ్రాముల బియ్యం, రోజుకు 8.10 రూపాయల డబ్బును విద్యార్థుల ఖాతాల్లో జమ చేసింది. నెలకోసారి ఈ డబ్బు, బియ్యం విద్యార్థులకు అందజేస్తోంది.