రాహుల్ పై సీనియర్ల కుట్ర – శివసేన

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 06:40 AM IST
రాహుల్ పై సీనియర్ల కుట్ర – శివసేన

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది.



రాహుల్‌ వైదొలగిన అనంతరం పార్టీని పునరుద్ధరించే సవాల్‌ను సీనియర్లు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఈ పాత కాపులు రాహుల్‌ గాంధీని వెన్నుపోటు పొడిచారని, బీజేపీ తలపెట్టని హాని సైతం వీరు రాహుల్‌కు తలపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.



చాలా మందికి జిల్లా నేతల స్ధాయి కూడా లేకున్నా గాంధీ, నెహ్రూ కుటుంబాల అండతో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారని శివసేన వ్యాఖ్యానించింది. మరి..రాహుల్ పై బీజేపీ ఆరోపణలు చేసిన సమయంలో…వీరంతా ఎక్కడున్నారంటూ నిలదీయడం విశేషం.
https://10tv.in/give-money-to-poor-distractions-through-media-wont-help-rahul-gandhi/
కేవలం పదవుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని, పదవులు రాని వారంతా..బీజేపీ వైపు వెళుతున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాహుల్, సోనియా ఏం చేస్తారని ప్రశ్నించింది. కొత్త తరహా రాజకీయ కరోనా వైరస్ గా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

పార్టీ అధిష్టానానికి 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం కలకలం రేకేత్తించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేయడం, అనంతరం సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్ గా కొనసాగింది. కొంతమంది సీనియర్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.



ఏకంగా రాజీనామాకు కొంతమంది సీనియర్లు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో శివసేన..రాహుల్ కు అనుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలో బీజేపీతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఉద్థవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.