Omicron : భారత్‌‌లో ఒమిక్రాన్ టెర్రర్..కేసులు ఎన్నంటే

గురువారం ఒక్కరోజే 15 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది.

Omicron : భారత్‌‌లో ఒమిక్రాన్ టెర్రర్..కేసులు ఎన్నంటే

Omicron (4)

Omicron Count In India : భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేరియంట్ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 88కి పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం ఒక్కరోజే 15 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్ లో 17, తెలంగాణలో 7, ఏపీలో ఒక ఒమిక్రాన్ కేసులను నిర్ధారించారు.

Read More : AP : స్నాప్‌చాట్‌లో యువకుడితో పరిచయం, లాంగ్ డ్రైవ్‌‌కు వెళ్లిన యువతి..తర్వాత

రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌-19 పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సమీక్ష నిర్వహించారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు సూచించారు. ఇక మహారాష్ట్రలో జనవరి వరకు కేసులు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఉద్దవ్ సర్కారు అప్రమత్తమైంది. ఈ నెల 31 వరకు 144వ సెక్షన్ విధించింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్ వేడుకలతో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.