AP : స్నాప్‌చాట్‌లో యువకుడితో పరిచయం, లాంగ్ డ్రైవ్‌‌కు వెళ్లిన యువతి..తర్వాత

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్‌ అయిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు.

AP : స్నాప్‌చాట్‌లో యువకుడితో పరిచయం, లాంగ్ డ్రైవ్‌‌కు వెళ్లిన యువతి..తర్వాత

East Godavari

Engineering Student Kidnapped : సోషల్‌ మీడియా విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా..కొంతమంది నిర్లక్ష్యం వహిస్తూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీని కారణంగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా..ఓ యువతి ఇలాగే మోసపోయింది. స్నాప్ చాట్ లో పరిచయం అయిన..యువకుడితో లాంగ్ డ్రైవ్ కు వెళ్లి…చిక్కుల్లో పడింది. ఆ అమ్మాయిని ఓ గదిలో బంధించి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి…ఆ యువకుడిని పట్టుకుని యువతిని రక్షించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Yadadri : యాదాద్రి పునర్ ప్రారంభోత్సవం..చురుగ్గా ఏర్పాట్లు

ప్రొఫైల్‌ పిక్‌ చూసి నమ్మారో నట్టేట ముంచేస్తారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి యాప్‌లలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తులతో స్నేహం చేయడంపై ఆలోచించాలి. ఇలాంటి విషయాలు తెలియకే ఓ విద్యార్థిని చిక్కుల్లో పడింది. స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయమైన యువకుడితో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అలాగే వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేసింది.

Read More : Oorvashi Rautela : ఒకప్పుడు కంటెస్టెంస్ట్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ జడ్జి.. రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్‌ అయిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఆధారంగా కొన్ని గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. భీమవరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్నాప్‌ చాట్‌ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే యువకుడు లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని విద్యార్థినిని నమ్మించాడు. ఆ తర్వాత భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో నిర్భంధించాడు. యువతి కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో తీసి వాటిని యువతి తల్లిదండ్రులకు పంపించి 5లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భీమవరంలో నిందితుడు ఫణీంద్రను అరెస్టు చేశారు.