Shirdi Sai Baba Temple : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ ఆలయం రాత్రి వేళ మూసివేత, భక్తులకు అనుమతి లేదు

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు.

Shirdi Sai Baba Temple : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ ఆలయం రాత్రి వేళ మూసివేత, భక్తులకు అనుమతి లేదు

Shirdi Sai Baba Temple

Shirdi Sai Baba Temple : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కాగా, ఒమిక్రాన్ ఎఫెక్ట్ ప్రముఖ ఆలయాలపైనా పడింది. ఆలయ వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చింది.

Upcoming EV Cars in India: 2022 నుంచి ఊపందుకోనున్న ఎలక్ట్రిక్ వాహనాల జోరు: భారత్ లో ఇవే టాప్ ఎలక్ట్రిక్ కార్స్

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు ఆలయం మూసి ఉంచుతామని అధికారులు తెలిపారు.

Robo : మనిషి చేయిని పట్టుకుని విదిలించిన “మరమనిషి”: రోబో సినిమా నిజం కానున్నదా?

ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకే తెరిచి ఉంచుతామని చెప్పారు. ఇక ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో నిర్వహించే ఆరతి కార్యక్రమానికి భక్తులను అనుమతించరు. అలాగే, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 10 గంటలకు జరిగే ప్రత్యేక ప్రార్థనలు (ఆరతి) కేవలం అర్చకుల సమక్షంలోనే జరుగుతాయని, భక్తులను అనుమతించమని షిర్డీ సాయి బాబా సంస్థాన్ అధికారులు స్పష్టం చేశారు.

ఒమిక్రాన్ కట్టడికి మహా సర్కార్ కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. పండుగల సీజన్ నేపథ్యంలో జన సమూహాలపై ఆంక్షలు పెట్టింది. అంతేకాదు ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100మంది, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250మంది ఎక్కువమంది హాజరు కావొద్దని ఆదేశించింది. ఇక జిమ్స్, స్పాలు, హోటల్స్, సినిమా హాల్స్ ను 50శాతం కెపాసిటీతోనే నడిపించుకోవాలని ఆదేశాలిచ్చింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడొద్దని చెప్పింది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు 250 మందికి జనాలు రాకూడదు. లేదా సభా స్థలిని బట్టి 25శాతానికి మించకూడదు. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్.. భారత్ నూ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం(డిసెంబర్ 26) కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులు గుర్తించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 434కు పెరిగింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31, రాజస్థాన్ లో 22 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ బారి నుంచి 130 మంది బాధితులు కోలుకున్నారు.