Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. స్థానిక దండా-2 పర్వత శిఖరంలో హిమపాతంలో చిక్కుకుని 10 మంది మరణించారు. ఈ హిమపాతంలో దాదాపు 29 మంది పర్వతారోహకులు చిక్కుకున్నారు. వీళ్లంతా శిఖరం అధిరోహించేందుకు వెళ్లారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. హిమపాతంలో చిక్కుకున్న పర్వాతారోహకులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీళ్లంతా నెహ్రూ మౌంటేనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనీలుగా ఉన్నారు. కాగా, మంచులో చిక్కుకున్న వారిలో 8 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు.