Delhi: ఎంబీబీఎస్ మరో బీటెక్ అయిపోయిందా? 20 పోస్టులకు క్యూకట్టిన వందల మంది

ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల్లీలోని క్యాన్సర్ ఆసుపత్రిలో నాన్ అడక్ జూనియర్ పోస్టుల భర్తీలో కనిపించిన దృశ్యం ఇది’’ అని ట్వీట్ చేశారు.

Delhi: ఎంబీబీఎస్ మరో బీటెక్ అయిపోయిందా? 20 పోస్టులకు క్యూకట్టిన వందల మంది

GBT Hospital: బీటెక్ సహా కొన్ని కోర్సుల పరిస్థితి తెలిసిందే. అర్హులు వందులు, వేలల్లో ఉంటారు. కానీ, ఉద్యోగాలు మాత్రం వందలు కూడా దాటవు. ఇవే కాదు, దేశంలో చాలా రంగాల పరిస్థితి అలాగే ఉంది. దేశంలో అర్హులు ఉన్నంతలో సగం ఉద్యోగాలు కూడా ఉండడం లేదు. అందుకే దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. ఒక సందర్భంలో పీహెచ్‭డీ చేసిన వ్యక్తి ఒకరు ప్యూన్ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. దీన్ని బట్టి చెప్పవచ్చు, దేశంలో ఉద్యోగ కల్పన ఎంత తక్కువ ఉందో. వెతుక్కుంటూ పోతే ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తాయి.

Kishan Reddy : సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు : కిషన్ రెడ్డి

అయితే ఇలాంటి పరిస్థితులు వైద్య రంగంలో కూడా వచ్చాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి ప్రభుత్వాలు తెలిపే డేటా ప్రకారం.. దేశంలో ప్రజలకు సరిపడా వైద్యులే లేరు. కానీ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కనిపించిన సీన్ మాత్రం ఇందుకు భిన్నమైన కోణాన్ని చూపిస్తోంది. ఢిల్లీలోని జీబీటీ ఆసుపత్రిలో 20 పోస్టులు ఖాళీ ఉంటే వందల మంది అప్టై చేసుకోవడానికి వచ్చారు. వారి రాకతో ఆసుపత్రి పరిసరాలు కిటకిటలాడిపోయాయి. వైద్య రంగంలో కూడా అర్హులు పెరిగి ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయా అనే అనుమానాల్ని కొందరు వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల్లీలోని క్యాన్సర్ ఆసుపత్రిలో నాన్ అడక్ జూనియర్ పోస్టుల భర్తీలో కనిపించిన దృశ్యం ఇది’’ అని ట్వీట్ చేశారు.

Viral Video: స్టేజీపై బొక్కబోర్లా పడిపోయిపోన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

అయితే దీనిపై ఇంకొంత మంది నెటిజెన్లు వేరేలా స్పందిస్తున్నారు. “దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఢిల్లీలో జూనియర్ రెసిడెంట్ జీతం అత్యధికంగా ఉన్నందున ఢిల్లీలో ఇది చాలా సాధారణం. కొంతమంది వైద్యులు ఆ ఉద్యోగాలు పొందడానికి లంచాలు కూడా ఇస్తారు” అని ప్రకాష్ అనే యూజర్ ట్వీట్ చేశారు. మరో ట్విటర్ వినియోగదారు కేతన్ రాంపాల్ స్పందిస్తూ “సార్, ఈ దృశ్యం ఢిల్లీలో కనిపించడం పట్ల నాకెలాంటి ఆశ్చర్యం లేదు. కారణం మంచి జీతం, నేర్చుకునే అవకాశం ఉంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఎంబీబీఎస్ వైద్యులు కూడా లేని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీలో ఇలాంటివి సాధారణమే’’ అని ట్వీట్ చేశారు.