EX CM Cleans Devotees Shoes : గురుద్వారలో భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..

ఉత్తరాఖండ్ మాజీ సీఎం,పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచారు. అనంతరం గురుద్వారా మందిరం పరిసరాలన్ని చీపురుతో శుభ్రం చేశారు.

EX CM Cleans Devotees Shoes : గురుద్వారలో భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..

Ex Cm Cleans Devotees Shoes

Harish Rawat cleans devotees shoes  :ఉత్తరాఖండ్ మాజీ సీఎం,పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచారు. అనంతరం గురుద్వారా మందిరం పరిసరాలన్ని చీపురుతో శుభ్రం చేశారు. హరీశ్ రావత్ ఎందుకలిలా చేశారు? అంటే..చేసిన పాపానికి ప్రాయశ్చితంగా ఇలా చేశారట. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నానని..ఇచ్చిన మాటకు కట్టుబడి ఇలా చేశానని అంటున్నారు. ఇంతకీ హరీశ్ రావత్ చేసిన పాపం ఏంటీ? ఎందుకిలా భక్తుల బూట్లు తుడిచారు? దేనికోసం ఆయన మాట ఇచ్చారు? అంటే..

గతవారం పంజాబ్‌లోని చండీగఢ్‌లో పర్యటించిన హరీశ్ రావత్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూతో సహా ఐదుగురు నేతలను ఉద్దేశించి సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. ఈ పదం ఉపయోగించిన హరీశ్ రావత్ సిక్కుల మనోభావాలను దెబ్బతీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన నేను చేసిన వ్యాఖ్యలు తప్పే అని అంగీకరించారు.

తన తప్పును సరిదిద్దుకున్నానంటూ ఆయన సిక్కులకు క్షమాపణ చెప్పారు. అంతేకాదు..నేను చేసిన వ్యాఖ్యలకు ప్రాయశ్చిత్తంగా చేసుకుంటానని అందుకోసం నేను చేసిన వ్యాఖ్యల పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ప్రకటించారు. దీంట్లో భాగంగా  శుక్రవారం (సెప్టెంబర్ 3,2021)ఉత్తరాఖండ్‌, ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలో ఉన్న గురుద్వారాను సందర్శించారు. అక్కడకు వచ్చిన భక్తుల బూట్లు తుడిచి, మందిర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు.తన పాపప్రాయశ్చితంలో భాగంగా హరీశ్ రావత్ సిక్కుల సంప్రదాయంగా తలకు పాగావలె ఓ వస్త్రాన్ని చుట్టుకుని భక్తుల బూట్లు తుడిచి మందిర పరిశరాలను చీపురు పట్టుకుని శుభ్రం చేశారు.

అసలేం జరిగిందంటే..
పంజాబ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌లో గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో హరీశ్‌ రావత్‌ మంగళవారం చండీగఢ్‌కు వెళ్లారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ భవన్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ, నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల గురించి చెబుతూ వారిని సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. దీంతో రావత్‌ పట్ల సిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఈ విమర్శలపై రావత్‌ బుధవారం ఫేస్‌బుక్‌ వేదికగా క్షమాపణలు తెలిపుతు.. “కొన్నిసార్లు.. మర్యాద, గౌరవాన్ని వ్యక్తపరిచే క్రమంలో కొన్ని పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. నేను అలాగే ఆ పవిత్ర పదాన్ని వాడి తప్పుచేశాను.

వారి మనోభావాలను బాధపెట్టినందుకుగానూ వారికి క్షమాపణ తెలియజేస్తున్నా. సిక్కుల సంప్రదాయం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా తప్పునకు ప్రాయశ్చిత్తంగా ఉత్తరాఖండ్ లోని గురుద్వారాలో కరసేవ చేస్తాను” అని రావత్‌ అని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం భక్తుల బూట్లను చేతుల్లోకి తీసుకుని వస్త్రంతో శుభ్రం చేసి వారి కాళ్లకు ధరింపజేశారు.అనంతరం చీపురుతో మందిరపరిశరాలను శుభ్రం చేశారు.