Satya Pal Malik: బీజేపీపై విమర్శలు, కాంగ్రెస్‭పై ప్రశంసలు.. మరింత దూకుడు పెంచిన బీజేపీ సీనియర్ నేత

తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్‭గా ఉన్న సమయంలో ఆ పదవి తనకు ఇస్తారని తెలుసని, అయితే బీజేపీపై విమర్శలు చేయడం వల్ల తనను దూరం పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి మేఘాలయకు బదిలీ చేశారని కూడా ఆయన అన్నారు. మాట్లాడటం ఆపేస్తే తానే ఉప రాష్ట్రపతి అయ్యేవాడినని, కానీ పదవుల కోసం తనకు నచ్చిన విషయాలపై మాట్లాడకుండా ఉండలేనని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు.

Satya Pal Malik: బీజేపీపై విమర్శలు, కాంగ్రెస్‭పై ప్రశంసలు.. మరింత దూకుడు పెంచిన బీజేపీ సీనియర్ నేత

Satya Pal Malik: సొంత పార్టీపై కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మేఘాలయ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం రాహుల్ గాంధీ మంచి పని చేస్తున్నారని భారత్ జోడో యాత్రను ఉద్దేశించి ఆయన అన్నారు. నిన్నటి వరకు బీజేపీపై విమర్శలతోనే ఆగిన ఆయన తాజాగా కాంగ్రెస్‭పై సానుకూలంగా స్పందించి రాజకీయాలపై కాకను పెంచారు.

ఇదే సందర్భంలో ఉప రాష్ట్రపతి పదవి, రైతు సమస్యలు, విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల రైడ్లను ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఇన్ని విషయాలను ప్రస్తావిస్తూ బీజేపీపై ఆయన ముప్పేట దాడి చేశారు. ఉప రాష్ట్రపతి పదవిపై ఆయన స్పందిస్తూ తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్‭గా ఉన్న సమయంలో ఆ పదవి తనకు ఇస్తారని తెలుసని, అయితే బీజేపీపై విమర్శలు చేయడం వల్ల తనను దూరం పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి మేఘాలయకు బదిలీ చేశారని కూడా అన్నారు. మాట్లాడటం ఆపేస్తే తానే ఉప రాష్ట్రపతి అయ్యేవాడినని, కానీ పదవుల కోసం తనకు నచ్చిన విషయాలపై మాట్లాడకుండా ఉండలేనని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు.

ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష నాయకుల్నే టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోందని, వాస్తవానికి ఇలాంటి రైడ్లు జరపాల్సిన స్థితిలో బీజేపీ నేతలు చాలా మంది ఉన్నారని, వారిపై కూడా రైడ్లు జరగాలని ఆయన అన్నారు. ఇక ఎప్పటిలాగే రైతులకు తన సంపూర్ణ మద్దతును సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధం చేసి అమలు చేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే రైతులకు మద్దతుగా తాను సైతం ఆందోళనకు దిగుతనని ఆయన ప్రకటించడం గమనార్హం.

Bharat Jodo Yatra: తమిళనాడు ముగించుకుని కేరళలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ