Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 16 రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. డీజిల్ ధరలు కూడా రూ.100కు చేరువలో ఉన్నాయి.

Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Rate (3)

Petrol Rate : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత 16 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్‌ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో ఇంధన ధరల ప్రభావం రైతులపై పడుతుంది. రైతులు యాంత్రికరణవైపు మొగ్గుచూపుతున్న తరుణంలో రేట్ల పెరుగుదల అనేది ఒకింత ప్రతికూలమే అని చెప్పక తప్పదు.

 

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.84.. డీజిల్‌ రూ.89.87
కోల్ కతా పెట్రోల్‌ రూ.102.08. డీజిల్‌ రూ.93.02
ముంబైలో పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.97.45
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96
విజయవాడలో రూ.107.93, డీజిల్‌ రూ.99.54
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.44, డీజిల్ 90.50