Petrol Prices : పెట్రోల్ ధరలు తగ్గవు.. కారణం ఏంటో చెప్పిన కేంద్రమంత్రి

పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం.

Petrol Prices : పెట్రోల్ ధరలు తగ్గవు.. కారణం ఏంటో చెప్పిన కేంద్రమంత్రి

Petrol Prices

Petrol Prices : దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. సెంచరీ కొట్టిన ధరలు జనాలకు షాక్ ఇస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే ఇక బతికేది ఎలా అని సామాన్యులు వాపోతున్నారు. కేంద్రం వెంటనే స్పందించి ఇంధన ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం. ఇంధన ధరలు తగ్గే అవకాశమే లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. దానికి కారణం ఏంటో కూడా సెలవిచ్చారాయన.

Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్‌ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్ర పెట్రోలియమ్, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి అన్నారు.

”పెట్రోల్ ధరలు తగ్గించడానికి కేంద్రం సుముఖంగానే ఉంది. కానీ, పెట్రోల్ ధరలు తగ్గవు. దానికి కారణం రాష్ట్రాలే. ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. లీటర్‌ పెట్రోల్‌ ధరలో కేంద్రానికి వచ్చే వాటా రూ.32. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు 19 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌పై రూ.32 పన్ను వసూలు చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ కేంద్రం రూ.32 మాత్రమే వసూలు చేస్తోంది. దీంతోనే కేంద్రం ఉచిత రేషన్, ఉచిత గృహాలు, ఉజ్వల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది’’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

Long Covid : ఈ 4 గ్రూపుల వారికి అత్యధిక ప్రమాదం

ఇటీవల జరిగిన జీఎస్‌టీ మండలి 45వ సమావేశంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు అనేక రాష్ట్రాలు సుముఖత చూపలేదని, ప్రభుత్వాల ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం కాదని ఆమె అన్నారు.