Plane Crashes: పొగ మంచు కారణంగా గుడిని ఢీకొన్న విమానం.. పైలట్ మృతి

రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.

Plane Crashes: పొగ మంచు కారణంగా గుడిని ఢీకొన్న విమానం.. పైలట్ మృతి

Plane Crashes: మధ్య ప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఒక ట్రైనీ విమానం గుడి పై భాగాన్ని ఢీకొనడంతో పైలట్ మరణించాడు. ట్రైనీ పైలట్ గాయపడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, రేవా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ విమానంలో పైలట్ విమల్ కుమార్, ట్రైనీ పైలట్ సోనూ యాదవ్ కలిసి ప్రయాణిస్తున్నారు.

MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ విమల్ అక్కడే మరణించాడు. ట్రైనీ పైలట్ గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ట్రైనీ పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విమానయాన శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.