ప్రపంచానికి ముందే చెప్పాం.. పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 07:47 AM IST
ప్రపంచానికి ముందే చెప్పాం.. పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

జైషే మహ్మద్‌ శిబిరాలే లక్ష్యంగా పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారత్‌ జరిపిన మెరుపు దాడులను పాకిస్తాన్ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ధ్రువీకరించారు. ఇండియా ఇటువంటి పని చేస్తుందని మేం ముందుగానే ఊహించామని, ప్రపంచానికి మేము చెబుతూనే ఉన్నా.. మా మాటలను పట్టించుకోలేదని కానీ ఇప్పుడు భారత్‌ మేం చెప్పిన విషయాలను నిజం చేసి చూపించిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందామని ఆయన పేర్కొన్నారు.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

వాస్తవాధీన రేఖను దాటి భారత్‌ నిబంధనలు ఉల్లంఘించి భారత్ పాకిస్తాన్ లోకి ప్రవేశించిందని, ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉందంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో భారత్‌ చర్యలపై అనుసరించాల్సిన విధానాలను చర్చిం‍చేందుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. మంత్రులు, అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
Also Read : సర్జికల్ ఎటాక్: పాక్ చేస్తానంది మనం చేసి చూపెట్టాం

కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్‌ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను చంపిన జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన మెరుపు దాడులలో 300 మంది ఉగ్రవాదులు హతం అయినట్లుగా తెలుస్తుంది.
Also Read : కుర్రాళ్లు అదరగొట్టారు : సర్జికల్ స్ట్రైక్‌పై క్రికెటర్ల కామెంట్స్