PM Modi : కరోనాపై భారత్ పోరాటం – మోడీ

కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో ప్రపంచం ఇలాంటి మహమ్మారిని చూడలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

PM Modi : కరోనాపై భారత్ పోరాటం – మోడీ

Pm Modi Addressing Nation

PM Modi Addressing Nation : కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో ప్రపంచం ఇలాంటి మహమ్మారిని చూడలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారీ స్థాయిలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న అంశాన్ని గుర్తు చేశారాయన. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని, అతి తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లకు పెంచడం జరిగిందన్నారు. విదేశాల నుంచి మందులు, వ్యాక్సిన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆక్సిజన్ కోసం సైనిక దళాలు కూడా పని చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారాయన. పోలియో, హెపటైటిస్ బీ కోసం ఏళ్ల తరబడి వేచి చూశామని, 2014లో వ్యాక్సినేషన్ కెపాసిటి 60 శాతం మాత్రమే ఉండేదని, కేవలం ఐదు సంవత్సరాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను 60 నుంచి 90 శాతానికి తీసుకెళ్లామన్నారు పీఎం మోడీ.

పిల్లలు, పేదల ఆరోగ్య పరిస్థితిపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు, కరోనాను భారత్ ఎలా తట్టుకుంటుందని ప్రపంచం మొత్తం చూసిందని తెలిపారు. కేవలం ఏడాదిలోనే రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను రూపొందించామన్నారు. ఇప్పటికే 23 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ లో వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 

వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు అన్ని రకాల సహకారం అందించాం.
రానున్న రోజుల్లో వ్యాక్సిన్ సరఫఱా ప్రక్రియ వేగవంతం.
ఏడు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం.

దేశంలో మూడు వ్యాక్సిన్లు తయారీ దశలో ఉన్నాయి.
విదేశాల నుంచి వ్యాక్సిన్లు తీసుకరావడానికి వేగంగా పని చేస్తున్నాం.
ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కోసం రీసెర్చ్ జరుగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ కంటే..ముందే ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే..పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి.
అత్యధిక శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం వల్లే..సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.
రాజ్యాంగం ప్రకారం…ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది.

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం.
వ్యాక్సినేషన్ ప్రక్రియను డీసెంట్రలైజ్ చేయాలని చాలా రాష్ట్రాలు కోరాయి.

Read More : AP Covid – 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే