PM Modi: ఈరోజు రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా మోడీ ప్రసంగం .. ఇందుకు ఓ కారణముందట..

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంప్రదాయానికి తెరతీయనున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సూర్యాస్తమయం తరువాత రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి..

PM Modi: ఈరోజు రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా మోడీ ప్రసంగం .. ఇందుకు ఓ కారణముందట..

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంప్రదాయానికి తెరతీయనున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సూర్యాస్తమయం తరువాత రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ 400 జయంతి సందర్భంగా ఎర్రకోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గోనున్నారు. మతసామరస్యంపై ప్రధాని ప్రసంగించనున్నారు.

PM Modi: సిక్కు గురు 400వ జయంతి.. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం

అదేవిధంగా తేజ్ బహదూర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపు, నాణేన్నిమోడీ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, విదేశీ ప్రముఖులతో పాటు నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోడీ రానుండటంతో ఎర్రకోట వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వెయ్యి మందికిపైగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోటలో వందకుపైగా సీసీటీవీల ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ రాజధానిలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను పాటించడం తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు.

PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ గురువారం సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రకోట సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట ప్రాకారం నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే సిక్కుల మత గురువు తేజ్ బహుదూర్ 400వ జయంతిని పురస్కరించుకొని ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగం చేయనుండటం కొత్త చర్చకు దారి తీసింది. 1675లో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ మరణ శిక్షకు అప్పటి ముఘల్ రాజు ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా అందుకు ప్రతీకగా ఇక్కడే బహుదూర్ జయంతి వేడుకలను నిర్ణయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.