PM Modi To Launch 5G: నేడు 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. తొలుత ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి..

దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

PM Modi To Launch 5G: నేడు 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. తొలుత ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి..

5G services

PM Modi To Launch 5G: దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే తొలుత దేశంలో ఎంపిక నగరాల్లో ఈ 5జీ సేవలు అందబాటులోకి వస్తాయి. వచ్చే కొన్నేళ్లలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోకి రానున్నాయి.

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్లు ఇక 10శాతం.. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం..

తక్కువ వ్యవధిలోనే దేశంలో 5జీ టెలికాం సేవలను 80శాతం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన.. దేశంలోనే అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. ఇందులో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన జియో 87,946.93 కోట్ల రూపాయల బిడ్‌తో విక్రయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగభాగాన్ని కొనుగోలు చేసింది. భారతదేశపు అత్యంత సంపన్న సంస్థ అయిన గౌతమ్ అదానీ గ్రూప్ 400 MHz కోసం 211.86 కోట్ల రూపాయల బిడ్ వేసింది. అయితే, ఇది పబ్లిక్ టెలిఫోన్ సేవలకు ఉపయోగించలేదు. అదే సమయంలో, టెలికాం దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్ భారతీ ఎయిర్‌టెల్ రూ. 43,039.63 కోట్ల బిడ్‌ను దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా రూ. 18,786.25 కోట్లకు దాఖలు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

5జీ టెక్నాలజీ భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2023 – 2040 మధ్యకాలంలో రూ. 36.4 లక్షల కోట్లు ($455 బిలియన్లు)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే భారతీయ ఎయిర్ టెల్ 5జీ కనెక్షన్ ను వినియోగించుకొని యూపీలోని వారణాసి నుంచి సీఎం యోగి ఆధిత్యనాథ్, జియో కనెక్షన్ సహాయంతో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ప్రధాని మోదీతో మాట్లాడతారని తెలుస్తోంది.