PM Modi: ప్రమాదకరంగా ఒమిక్రాన్.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

PM Modi: ప్రమాదకరంగా ఒమిక్రాన్.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Modi

PM Modi: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తూ కలవరపెడుతున్న వేళ ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

కరోనాపై యుద్ధానికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతోండగా.. జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు మోదీ.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ సమయంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయని హెచ్చరించారు.

మాస్క్‌లు ఉపయోగించాలి.. బౌతికదూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

దేశంలో మొత్తం 18లక్షల ఐసోలేషన్ బెడ్స్, ఐదు లక్షల ఆక్సిజన్ బెడ్స్, లక్షా 40వేల ICU బెడ్స్, 90వేల ఐసీయూ, నాన్ ఐసీయూ పిల్లల బెడ్లు ఉన్నాయని వెల్లడించారు.

దేశంలో మూడు వేలకు పైగా ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని, నాలుగు వేల ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని, కావాల్సినన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు మోదీ.

ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, వృద్ధులకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.