వీరుడికి వందనం : నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి

  • Published By: venkaiahnaidu ,Published On : January 23, 2019 / 07:28 AM IST
వీరుడికి వందనం : నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి

భారతదేశ స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలెనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంజి కారణంగా ఇవాళ(జనవరి 23,2019) దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు, విద్యార్ధులు ఆయనకు నివాళులర్పించారు. ఆజాద్ హిందూ షౌజ్ స్థాపించి బ్రిటీషర్లపై వీర పోరాటం చేసి నేతాజీగా కీర్తిగడించిన సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తదితరులు ఆయనకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలో నేతాజీ పాత్రను వివరించేలా ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఓ మ్యూజియమ్ ను ఇవాళ ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపనకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గతేడాది డిసెంబర్ లో అండమాన్ దీవుల్లోని మూడు దీవులకు పేర్లను మారుస్తూ ప్రధాని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఒడిషా రాష్ట్రంలోని ఖాట్గాలో 1879, జనవరి23న ప్రభావతి దేవి, జానకినాథ్ బోస్ దంపతులకు  నేతాజీ జన్మించారు. నేతాజీ తండ్రి అడ్వకేట్. జాతీయవాది కూడా అయిన ఆయన బెంగాల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే నేతాజీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రభావంతో సన్యాసం స్వీకరించారు. మానవసేవే మాధవసేవ  అన్న రామకృష్ణుడి ఉపదేశంతో దేశసేవకు నడుంకట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పోరాటాల్లో భాగస్వామి అయ్యారు.

1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైనప్పటికీ తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే తనప ప్రధమ కర్తవ్యం అని ఉద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్ర్యం రావాలంటే సొంత సైన్యంతో పాటు ఇతర దేశాల సహకారం కూడా అవసరమని భావించాడు. ఆజాద్ హిందూ ఫైజ్ ను స్థాపించి భారత్ కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకపాత్ర వహించాడు. అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు.1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.