అడవుల పాలైన కోడిపిల్లలు, పట్టుకెళ్లిన ప్రజలు

అడవుల పాలైన కోడిపిల్లలు, పట్టుకెళ్లిన ప్రజలు

poultry farmers and merchants : కోళ్ల ఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య జరిగిన గొడవల కారణంగా..కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. ఆగ్రహానికి గురైన పెంపకందారులు కోడి పిల్లలను అడవుల్లో వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు వాటిని బ్యాగుల్లో తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

చిక్క తాలుకా పరిధిలో కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందచేస్తుంటాయి. ఇలా ఎందుకు చేస్తారంటే..అవి పెద్దయ్యే దాక సంరక్షిస్తుంటారు. అనంతరం అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళుతారు. ఇందుకు గాను..ఫారం యజమానులకు కోడికి ఇంత అని రేటు కట్టి డబ్బులు చెల్లిస్తాయి. అయితే..ఇటీవలే..కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం వల్ల షురూ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా..మొండికేశారు. దీంతో పెంపకందారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల మాట వినేది లేదంటూ..వారు ఇచ్చిన పిల్లలను 2021, జనవరి 08వ తేదీ శుక్రవారం, 09వ తేదీ శనివారం రోజుల్లో రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఈ విషయం ఆనోట..ఈ నోట..పడింది. ప్రజలు వాటి దగ్గరకు వెళ్లి…బ్యాగులు, పెట్టెల్లో కోడిపిల్లలను తీసుకెళ్లారు.