Prashant Kishor: చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్

దేశంలో విపక్షాల ఐక్యతకోసం నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు.

Prashant Kishor: చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishor

Bihar Politics: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు. బీజేపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి చేర్చి మోదీని గద్దెదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను నితీశ్ కుమార్ కలిశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి విపక్షాలు ఐక్యంగా ఎలా కదలాలన్న అంశంపై వీరు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ను ఉద్దేశిస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ నితీష్ కు చురకలంటించాడు.

Nitish Kumar: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన నితీశ్ కుమార్

నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు. గత ఐదేళ్ల క్రితం ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కలిగి ఉన్నారు. గతంలో చంద్రబాబు పోషించిన పాత్రను ప్రస్తుతం నితీష్ కుమార్ పోషించాలని ఆరాటపడుతున్నాడు. అయితే, ఆయన తన పార్టీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలతో కుంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఆయన పార్టీకి బీహార్‌లో ఒక్క ఎంపీకూడా లేరు.

Bihar CM Nitish Kumar : సీఎం సార్..నేను చనిపోలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్‌కు లేఖ

చంద్రబాబు గత ఎన్నికల సమయంలో బీజేపీయేతర పక్షాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, గత ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి కేవలం మూడు ఎంపీ స్థానాలు వచ్చాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. దీంతో దారుణ పరాభవాన్ని ఆయన చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేస్తానంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడుకు గత ఎన్నికల్లో ఏ పరిస్థితి ఎదురైందో.. వచ్చే ఎన్నికల తరువాత నితీష్ కుమార్‌కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందంటూ ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.