నెమళ్ళకు ఆహారం తినిపించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్!

  • Published By: vamsi ,Published On : August 23, 2020 / 01:14 PM IST
నెమళ్ళకు ఆహారం తినిపించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్!

ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు, అందులో తాను స్వయంగా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లకు చేతితో తినిపిస్తున్నారు. వీడియోలో నెమళ్ళు పీఎం మోడీ చేతిని ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది.

ప్రధాని తన నివాసం వద్ద ఉదయం నడుస్తున్న సమయంలో, అతని చుట్టూ చాలా నెమళ్ళు నడుస్తున్నట్లు కనిపించాయి. ఆ సమయంలో ప్రధానమంత్రి మోడీ మరియు నెమళ్ల వీడియోలు తీశారు.

ప్రధానమంత్రి అవసరమైన ఫైళ్ళను చూస్తూ ఉండగా.. దాని ప్రక్కన ఉన్న నెమలి కూడా ఫైళ్ళను జాగ్రత్తగా చూస్తున్నట్లుగా వీడియోలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. పక్షుల గూడు కోసం లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ అధికారిక నివాసంలో నిర్మాణాలు ఉన్నాయి.