PM Modi: అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడే

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన తన ఓటు వేశారు.

PM Modi: అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడే

PM Modi: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు సోమవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో మోదీ తన ఓటు వేశారు. ప్రత్యేక భద్రత మధ్య ఓటింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రధాని తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు.

Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు.. టెంపుల్‌లో డాన్స్ చేసినందుకు జాబ్ కోల్పోయిన మహిళలు

ఈ సందర్భంగా స్థానికులకు మోదీ అభివాదం చేశారు. ఓటు వేసిన అనంతరం తిరిగి వెళ్లిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గుజరాత్‌లోనే ఓటు వేయనున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నారన్‪పుర పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రధాని, హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 833 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.