PM Narendra Modi: భారతావని ఎప్పుడూ యుద్ధాన్ని మొదటి అవకాశంగా ఎంచుకోదు.. సైనికులతో దీపావళి వేడుల్లో మోదీ

దేశ రక్షణకోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సైనికులతో ఉండటం కంటే గొప్ప దీపావళి వేడుక తనకు మరేదీ లేదు. సైనికులే తన కుటుంబం. అందుకే పండుగకు ఇక్కడకు వచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Narendra Modi: భారతావని ఎప్పుడూ యుద్ధాన్ని మొదటి అవకాశంగా ఎంచుకోదు.. సైనికులతో దీపావళి వేడుల్లో మోదీ

PM Narendra Modi

PM Narendra Modi: భారతావని యుద్ధాన్ని ఎప్పుడూ మొదటి అవకాశంగా ఎంచుకోదు. ఆనాడు లంక, కురుక్షేత్రాల్లోనూ యుద్ధాన్ని అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా ప్రపంచ శాంతి కోసమే మేం పాటుపడుతున్నాం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Narendra Modi

దీపావళి పండగను పురస్కరించుకొని మోదీ సోమవారం కార్గిల్ వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని మోదీ స్వీట్లు పంచిపెట్టారు. కొద్దిసేపు సైనికులతో ముచ్చటించారు. అనంతరం వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

PM Narendra Modi

PM Narendra Modi

దేశ రక్షణకోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సైనికులతో ఉండటం కంటే గొప్ప దీపావళి వేడుక తనకు మరేదీ లేదు. సైనికులే తన కుటుంబం. అందుకే పండుగకు ఇక్కడకు వచ్చానని మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Narendra Modi

జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉంది. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు. మన సరిహద్దులను మీరు రక్షిస్తున్నారు కాబట్టే దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారని మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Narendra Modi

సైనికుల్లాగే మేముకూడా దేశంలో అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం వంటి దుష్ట శక్తులపై పోరాడుతున్నామని మోదీ తెలిపారు. ప్రపంచ వేదికగా భారత్ బలం పెరిగింది. ఆర్థికంగా ఐదో శక్తిగా ఎదిగాం అని మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Narendra Modi

కార్గిల్ లో విజయ పతాకం ఎగురకుండా పాక్ తో ఏ యుద్ధమూ జరగలేదు. దీపావళి అంటే చెడుకు ముగింపు పలుకుతూ చేసుకునే పండగ. కార్గిల్ దాన్ని సుసాధ్యం చేసింది. కార్గిల్ లో మన సైన్యం తీవ్రవాదాన్ని అణచివేసిందని మోదీ అన్నారు.

PM Narendra Modi

PM Narendra Modi