దేశంలో మొదటిసారి… ప్రభుత్వంపై అనుకూల వేవ్ ఉంది

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 05:11 AM IST
దేశంలో మొదటిసారి… ప్రభుత్వంపై అనుకూల వేవ్ ఉంది

కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం  రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఐదేళ్లలో ఎలాంటి అవినీతి లేని పాలనను అందించామని ప్రధాని తెలిపారు.కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు.దేశంలో మొట్టమొదటిసారిగా ప్రో ఇన్ కంబెన్సీ వేవ్ ఉందన్నారు.మొదటిసారి ఓటు వేస్తున్న వారి నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు అవసరం లేదని మోడీ తెలిపారు.ప్రజల ప్రేమే తన బలమన్నారు. బీజేపీ కార్యకర్తలు ఓడిపోతే తనకు బాధగా ఉంటుందన్నారు.ప్రజల హృదయాలను గెలిస్తే..విజయం అదే వస్తుందన్నారు. 

11 గంటలకు కాలభైరవ మందిరంలో పూజల అనంతరం 11.30గంటలకు మోడీ నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు.నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అకాలీదళ్‌ నాయకుడు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే, కేంద్రమంత్రులు రాంవిలాస్‌ పాశ్వాన్,సుష్మా స్వరాజ్,రాజ్ నాథ్ సింగ్,బీజేపీ చీఫ్ అమిత్ షా,తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, ఇతర ఎన్‌డీఏ నేతలు ఇప్పటికే వారణాశి చేరుకున్నారు. ఏడో ఏడో విడతలో మే-19,2019న వారణాశి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాశి నుంచి పోటీ చేసిన మోడీ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి వారణాశి నుంచే మోడీ పోటీ చేస్తుండటంతో ఈసారి ఎలాగైనా గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేలా బీజేపీ నాయకులు ఫ్లాన్ చేస్తున్నారు