Punjab Poll : చన్నీనా ? సిద్ధూనా ?.. పంజాబ్ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ప్రకటనకు టైం ఫిక్స్

పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవ‌ర‌నే దానిపై అగ్రనాయ‌క‌త్వం ఎలాంటి సంకేతాలు పంప‌క‌పోయినా సీఎం చ‌న్నీ చంకౌర్ సాహిబ్‌తో పాటు బ‌దౌర్‌లోనూ నామినేష‌న్ వేయ‌డంతో..

Punjab Poll : చన్నీనా ? సిద్ధూనా ?.. పంజాబ్ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ప్రకటనకు టైం ఫిక్స్

Punjab

Punjab CM candidate CM candidate : చ‌న్నీనా..? సిద్ధూనా..? పంజాబ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు ఎల్లుండి తెరపడనుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పేరును 2022, ఫిబ్రవరి 06వ తేదీ వెల్లడిస్తామని పంజాబ్‌ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ క్లారిటీ ఇచ్చారు. సీఎం అభ్యర్ధిత్వం కోసం చ‌న్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఇక పార్టీ హైక‌మాండ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవ‌రిని ప్రతిపాదించినా తాను మ‌ద్దతిస్తాన‌న్నారు చ‌న్నీ. సీఎం అభ్యర్ధిత్వాన్ని ప్రక‌టించాల‌న్న పంజాబీల డిమాండ్‌ను నెర‌వేరుస్తున్నందుకు రాహుల్ గాంధీకి తాను ధ‌న్యవాదాలు చెబుతున్నాన‌ని చ‌న్నీ ట్వీట్ చేశారు.

Read More : Vijayashanthi : తమిళనాడులో శశికళని కలిసిన విజయశాంతి.. నటిగానా? పార్టీ తరపునా?

మరోవైపు పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవ‌ర‌నే దానిపై అగ్రనాయ‌క‌త్వం ఎలాంటి సంకేతాలు పంప‌క‌పోయినా సీఎం చ‌న్నీ చంకౌర్ సాహిబ్‌తో పాటు బ‌దౌర్‌లోనూ నామినేష‌న్ వేయ‌డంతో చ‌న్నీ వైపే అధిష్టానం మొగ్గుచూపింద‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. మ‌రోవైపు సిద్ధూ సైతం సీఎం అభ్యర్ధిత్వంపై భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేయాలో అన్నది కాంగ్రెస్‌ అధిష్టానం తేల్చలేకపోతున్నది. ఈ ఎంపికను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసింది.

Read More : Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి

పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ కూటమిలో బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 37 స్థానల్లో బరిలోకి దిగుతోంది. అలాగే శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడుతోంది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఒప్పందం చేసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.